Just In
- 6 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 1 hr ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాప్ 10: ఆల్ టైమ్ టాప్ సౌత్ ఫిల్మ్స్ ...కలెక్షన్స్
హైదరాబాద్ : దక్షిణ భారత దేశ చిత్రాలకు దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బాలీవుడ్ కు తగిన రీతిలో పోటీ ఇచ్చే పరిశ్రమలు మనవి. ఇక్కడ చిత్రాలుకు రీజనల్ మార్కెట్ పరిమితి ఉన్నా కలెక్షన్స్ వైజ్ గా రికార్డులు క్రియేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి.
తెలుగు,తమిళ, మళయాళ, కన్నడ పరిశ్రమలు ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండిస్ట్రీని సుసంపర్నం చేస్తున్నాయి. ఇక్కడ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో సైతం రీమేక్ లు గా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ రోజున సౌతిండియా చిత్రం అంటే అందరి దృష్టీ ఇటుపైనే ఉంది.
ఇక్కడ రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి,మోహన్ లాల్, ముమ్మట్టి సూపర్ స్టార్స్ ఈ ఇండస్ట్రీల వైపు అందరి దృష్టీ పడేలా చేస్తున్నారు. బడ్దెట్ వైజ్ లోనూ,కలెక్షన్స్ వైజ్ లోనూ హిందీ భారీ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. అంతేకాకుండా ఇక్కడ దర్శకులు సైతం హిందీకు వెళ్లి అక్కడ హీరోలకు హిట్స్ ఇస్తున్నారు.
ఆల్ టైమ్ టాప్ సౌత్ ఫిల్మ్స్ (ట్రైడ్ లో చెప్పబడుతున్న లెక్కల మాత్రమే) ... అలాగే.. ఈ లెక్కలన్నీ డిస్ట్రిబ్యూటర్ షేర్ (టోటల్ ) మాత్రమే అని గమనించగలరు.
స్లైడ్ షోలో...

రోబో (డబ్బింగ్ లతో కలిపి) - 160 కోట్లు
రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రికార్డులు క్రియేట్ చేసింది. రజనీ ఇందులో ద్విపాత్రాభినయం చేసారు.

మగధీర(తమిళ డబ్బింగ్ తో కలిపి) -83 కోట్లు
రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ట్రెండ్ సెట్టర్. ఈ చిత్రం రామ్ చరణ్ ఇమేజ్ ని అందనంత ఎత్తుకు తీసుకు వెళ్లింది.

శివాజీ -(తెలుగు డబ్బింగ్ తో కలిపి) 80 కోట్లు
రజనీ,శివాజీ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. రజనీలో మాస్ స్టైల్ ని తమ సాంకేతిక నైపుణ్యంతో శంకర్ పతాక స్దాయికి తీసుకువెళ్లి హిట్ కొట్టారు.

లింగా(తెలగు డబ్బింగ్ తో కలిపి) -78.5 కోట్లు
రజనీకాంత్ ద్విపాత్రాభియనం చేసిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా తమిళ,తెలుగు భాషల్లో బాగానే వర్కవుట్ అయ్యింది. కానీ పెట్టుబడికి తగినట్లు కలెక్టు చేయలేకపోయింది.

అత్తారింటికి దారేది- 74.9
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డుని క్రియేట్ చేసింది. రిలీజ్ కుముందు ఫుటేజ్ లీకైనా కలెక్షన్స్ పై ప్రభావం కనపడలేదు.

తుపాక్కి(తెలుగుతో కలిపి)- 69 కోట్లు
మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళంలో బాగా వర్కవుట్ అయ్యింది.

కత్తి(డబ్బింగ్ లేదు) -68 కోట్లు
మరోసారి మురగదాస్, విజయ్ కలిసి చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా తమిళంలో రికార్డులు క్రియేట్ చేసింది.

సింగం 2(డబ్బింగ్ తో కలిపి) -67 కోట్లు
సూర్య చిత్రం సింగం కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం టాక్ పెద్దగా లేకపోయినా కలెక్షన్స్ పరంగా బాగా వర్కువుట్ అయ్యింది.

గబ్బర్ సింగ్ - 60.5 కోట్లు
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం హిందీ చిత్రం దబాంగ్ కు రీమేక్. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగా సంపాదించింది.

రేసు గుర్రం -59.4 కోట్లు
అల్లు అర్జున్,సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం క్రితం సంవత్సరం సూపర్ హిట్ లలో ఒకటిగా నిలిచి,కలెక్షన్స్ వర్షం కురిపించింది.