»   » పైరసీ, నెటిగివ్ రివ్యూలపై డీజే ఎటాక్.. వంద కోట్లకు చేరువలో దువ్వాడ..

పైరసీ, నెటిగివ్ రివ్యూలపై డీజే ఎటాక్.. వంద కోట్లకు చేరువలో దువ్వాడ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతికూల రివ్యూలు, నెటిగివ్ టాక్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం (డీజే) చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రాన్ని తలదన్నేలా వసూళ్లను సాధిస్తున్నది. తొలుత ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు ఆదరిచడంతో దువ్వాడ జగన్నాథం చిత్రం వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది.

ఐదో రోజున రూ.82 కోట్లు

ఐదో రోజున రూ.82 కోట్లు

తొలి ఆట తర్వాత విమర్శకుల మిశ్రమ స్పందన, రొటీన్ చిత్రమంటూ వచ్చిన టాక్‌ను ఎదురించడంలో డీజే చిత్రం సఫలమైంది. రిలీజ్ రోజున డీజే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లు వసూలు చేసింది. అదే జోష్‌ను కొనసాగిస్తూ ఐదో రోజుకు రూ.82 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. డీజే సాధిస్తున్న కలెక్షన్లు బాలీవుడ్ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.


 పైరసీ భూతం కాటేసినా..

పైరసీ భూతం కాటేసినా..

వసూళ్లపరంగా దూసుకెళ్తున్న దువ్వాడ జగన్నాథాన్ని పైరసీ భూతం కాటేసింది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి నిడివి ఉన్న వీడియోను పైరసీదారులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలిరావడంతో దాని ప్రభావం డీజేపై పడకపోవడం గమనార్హం.


రెండు విభిన్నమైన పాత్రల్లో..

రెండు విభిన్నమైన పాత్రల్లో..

పూర్తి వినోదభరిత చిత్రంగా రూపుదిద్దుకొన్న దువ్వాడ జగన్నాథం చిత్రంలో అల్లు అర్జున్ రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించారు. సంప్రదాయ బ్రహ్మణ యువకుడిగా, అన్యాయాన్ని ఎదురించే డీజేగా అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. కామెడీ సన్నివేశాలు బాగా పడటంతోపాటు అల్లు అర్జున్ డ్యాన్సులు, ఫైట్స్‌ సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.


 పూజా హెగ్డే అందాల ఆరబోత

పూజా హెగ్డే అందాల ఆరబోత

డీజేలో హీరోయిన్‌గా అందాలతార పూజాహెగ్డే నటించింది. ఆమె అందాల ఆరబోత, గ్లామర్ ప్రేక్షకుడికి పండుగగా మారింది. బికిని ధరించడం, పాటలతో, శృంగార సన్నివేశాల్లో ఎలాంటి తడబాటుకు గురికాకుండా నటించడం కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. ఫ్యామిలీ, యూత్ ఆకర్షించే అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల డీజే కలెక్షన్ల పంట పడిస్తున్నది.English summary
Allu Arjun’s Duvvada Jagannadham aka DJ may not have won over the critics but the film is rocking the box-office, leaving everybody who doubted its potential at the ticket window bamboozled. While many expected the initial mixed reviews and mediocre talk might affect film’s run, the numbers have proved everyone wrong. The film opened big on its release day with worldwide collection of Rs 33 crore and at the end of its fifth day has grossed a whopping Rs 82 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X