Just In
Don't Miss!
- News
షాకింగ్: సీరం ఫార్మాలో మళ్లీ మంటలు -ఫైర్ ఫైటర్లకు సవాలుగా -ఇప్పటికే 5గురు మృతి..
- Sports
India vs England: స్టోక్స్, ఆర్చర్ ఆగయా.. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ ఇదే!
- Finance
హైదరాబాద్ సహా సిటీల్లో హౌసింగ్ సేల్స్ జంప్, పూర్తి ఏడాది పరంగా డౌన్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టుడే రిలీజ్ :అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' కథ, టాక్
హైదరాబాద్: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్యంగా విడుదలైంది. ఫ్యామిలీ ఎమెషన్స్ ని వెండితెరపై కథలుగా తెరకెక్కించి విజయాలు సాదిస్తున్న దర్శకుడు పరుశరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు చిత్రం టీజర్, ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. ఈ చిత్రం కథ,టాక్ ఏమిటో ఇక్కడ చూద్దాం.
ఇక యుఎస్ నుంచి అందిన రిపోర్ట్ ల ప్రకారం...సినిమా బాగుందని, ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా అని తెలుస్తోంది. అయితే కథ మాత్రం రొటీన్ గా..చాలా సార్లు తెరపై చూసిందే నఅి, కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా ఉందని అంటున్నారు.
అయితే సినిమాకు పరుశరామ్ అందించిన డైలాగులు ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ లో అద్బుతంగా పండాయని తెలుస్తోంది. అలాగే అలీ, సుబ్బరాజు మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కూడా బాగా పేలినట్లు సమాచారం.
చిత్రం కథ విషయానికి వస్తే శిరీష్ (అల్లు శిరీష్) బిజినెస్ ట్రిప్ కోసం కాశ్మీర్ వేలీ వెళితే అక్కడ టెక్కింగ్ ఏక్సిడెంట్ లో ఇరుక్కున్న అనన్య(లావణ్య త్రిపాఠి)ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను హాస్పటిల్ లో జాయిన్ చేస్తాడు. ఆమెకు ...శిరీష్ హాస్పిల్ లో జాయిన్ చేసాడనే విషయం తెలియదు.

శ్రీరస్తు ..శుభమస్తు టైటిల్ సాంగ్ అయ్యాక వైజాగ్ గీతమ్స్ కాలేజీలో ఓపెన్ చేస్తే బిటెక్ ఫైనలియర్ చదువుతున్న అనుని డైలీ ఫాలో అవుతూంటాడు శిరీష్. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. తర్వాత తన ప్రేమ విషయం తన తండ్రి (ప్రకాష్ రాజ్) కు చెప్తాడు శిరీష్. కానీ ప్రకాష్ రాజ్ రిజెక్ట్ చేస్తాడు. మన డబ్బు చూసి ప్రేమని ఆమె ఏక్సెప్టు చేస్తుంది అంటాడు.
అప్పడు శిరీష్ తను ఫలానా రిచ్ కుటుంబానికి చెందిన వాడిని అని చెప్పకుండా ఆమె ప్రేమను గెలుస్తానని ఛాలెంజ్ చేసి ఇంట్లోంచి వచ్చేస్తాడు. అక్కడ నుంచి ఏం జరిగింది..అనన్య..శిరీష్ ప్రేమను ఏక్సెప్టు చేసిందా లేదా అనే విషయాలు చుట్టూ మిగతా ప్రేమ కథ నడుస్తుంది.
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలో నటించారు.
దర్శకుడు పరుశురామ్(బుజ్జి) మాట్లాడుతూ " అల్లు శిరీష్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఫ్యామిలి ఎమెషన్స్ కి విలవలు తగ్గుతున్న ఈరోజుల్లో, ఫ్యామిలి అంటే పక్కింటి వాడి మేటర్ కాదు మనది మన ఫ్యామిలి, మన అనుకుంటే ఎలాంటి సమస్యనైనా సింపిల్ గా సాల్వ్ చేయచ్చు అని తెలియజెప్పె మంచి చిత్రం మా ' శ్రీరస్తు శుభమస్తు'. ఓ మంచి ఫ్యామిలి లో అన్ని ఎమెషన్స్ కలిసి వుంటాయి. అలాంటి అన్ని ఎమోషన్స్ ని కలిపి శ్రీరస్తు శుభమస్తు చిత్రంలో చూపించాము. శిరీష్ ఎనర్జి సూపర్బ్, లావణ్య తొ వచ్చే సన్నివేశాలు యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి
విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, రావురమేష్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి నటీనటులతో ఫుల్‌పేక్డ్ గా ఈ చిత్రం చేశాము. ప్రతి కేరక్టర్ కి ప్రాముఖ్యత వుంటుంది. వీరందరి కాంబినేషన్ లో వచ్చే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్నిఅలరిస్తాయి. చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ కి థమన్.యస్.యస్ సంగీతం అందిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు."అని అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ..చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా మా బ్యానర్ లో వస్తున్న చిత్రమిది. ఫ్యామిలి ఆడియన్స్ అందరిని అలరించే మంచి చిత్రాన్ని దర్శకుడు బుజ్జి తీసాడు. ఇప్పటికే పాజిటివ్ బజ్ వున్న ఈ చిత్రంలో నటీనటులందరూ చాలా బాగా నటించారు. టీజర్ కి చాలా మంచి ఆదరణ లభించింది. ఎస్.ఎస్.థమన్ అందించిన ఆడియో సినిమాకి ప్లస్ అవుతుంది.. "అని అన్నారు.
నటీనటులు..అల్లు శిరిష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర తదితరులు నటించారు.. శ్రీరస్తు శుభమస్తు గీతా ఆర్ట్స్ బ్యానర్ సంగీతం - తమన్.యస్.యస్ యాక్షన్ - రామ్, లక్ష్మణ్ ఆర్ట్ - రామాంజనేయులు డిఓపి - మని కంతన్ పి.ఆర్.ఓ- ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- నాగరాజు ఎడిటర్ - మార్తాడ్ కె.వెంకటేష్ నిర్మాత - అల్లు అరవింద్