»   »  ‘శ్రీరస్తు శుభమస్తు’ రెండో సారీ ఫ్లాఫ్.,నమ్మరా? అయితే ఇది చదవండి

‘శ్రీరస్తు శుభమస్తు’ రెండో సారీ ఫ్లాఫ్.,నమ్మరా? అయితే ఇది చదవండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ సినిమా రిలీజైన అతి తక్కువ టైమ్ లో రెండు సార్లు ఫ్లాఫ్ అవుతుందా...అవుతుంది అని అల్లు శిరీష్ హీరోగా నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' ప్రూవ్ చేసింది. ఈ సినిమా ఆగష్టు 5న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే.

తన కెరీర్‌కు ఊపునిచ్చే ఓ మంచి సక్సెస్ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న శిరీష్‌కు ఈ సినిమా కచ్చితంగా ఆ హిట్‌గా నిలుస్తుందన్న ప్రచారం మొదట్నుంచీ వినిపించింది. ప్రచారానికి తగ్గట్లే ఈ సినిమా కూడా బాగుందని టాక్ రావడంతో ఆంధ్రా, తెలంగానాలలో కలెక్షన్స్ బాగానే వచ్చాయి.


రొటిన్ కథతోనే వస్తూ...(అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' రివ్యూ)


లెక్కలు తేలాక చూస్తే.. నైజాం, సీడెడ్ ఏరియాల్లో శిరీష్ మార్కెట్‌తో పోలిస్తే మంచి కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ క్లారిటీ ఇచ్చింది. అయితే యుఎస్ లో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే రిలీజైన ఇక్కడ హిట్ టాక్ వచ్చాక, అక్కడ జనం చూడటానికి ఆసక్తి చూపుతారామో అనే ఆశతో మరో సారి రీ రిలీజ్ చేసారు. అయితే ఇక్కడ టాక్ కు అక్కడ కలెక్షన్స్ సంభంధం లేదని సమాచారం. అక్కడ ఇంకా పెళ్లి చూపులు చిత్రం హవా నడుస్తోంది.


Allu Sirish's Srirastu Subhamastu flops one more time!

శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‍గా నటించిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. గతంలో 'సోలో', 'సారొచ్చారు' లాంటి కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్.యస్‌.యస్‌, యాక్షన్ - రామ్, లక్ష్మణ్, ఆర్ట్ - రామాంజనేయులు, డిఓపి - మని కంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌- నాగరాజు, ఎడిటర్ - మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత - అల్లు అరవింద్, దర్శకుడు - పరశురామ్.

English summary
'Srirastu Subhamastu' film was released last weekend second time USA box-office. But the Allu Sirish and Lavanya Tripathi starrer has failed twice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu