For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాహుబలి 2 కంటే నా సినిమాకే ఎక్కువ కలెక్షన్స్.. నాటి క్లాసిక్‌పై అమితాబ్ ట్వీట్

  |

  ఇండియన్ సినీ హిస్టరీలో బాహుబలి సినిమాది ఓ సువర్ణాధ్యాయం. బాక్సాఫీస్ లెక్కల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. రెండు చిత్రాలు కలిసి రెండు వేల కోట్లను కొల్లగొట్టింది. అయితే ఇందులో బాహుబలి 2దే అత్యధిక భాగం. భారత సినీ చరిత్రలో ఈ మైలురాయిను అందుకున్న మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసి.. ఖాన్ త్రయం, బాలీవుడ్ హీరోలను తలదించుకునేలా చేసింది.

  ఎవ్వరికీ సాధ్యం కానీ ఆ ఫీట్‌ను బాహుబలి అందుకుంది. అయితే ప్రస్తుతం బిగ్‌బీ.. తన క్లాసిక్ చిత్రమైన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం గురించి చెబుతూ బాహుబలితో పోల్చాడు. దీంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అమితాబ్ చేసిన కామెంట్ ఏంటో ఓసారి చూద్దాం.

  రికార్డులు క్రియేట్ చేసిన చిత్రం..

  రికార్డులు క్రియేట్ చేసిన చిత్రం..

  1977 మే 27న విడులైన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేసింది. నిర్విరామంగా 25 వారాల పాటు ముంబైలోని 25 థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. అన్నదమ్ములైన ముగ్గురు (వినోద్ ఖన్నా, రిషీ కపూర్, అమితాబ్ బచ్చన్) కొన్ని కారణాల వల్ల చిన్నతనంలోనే విడిపోవడం.. మళ్లీ కలుసుని శత్రువుపై ఏ విధంగా పగ తీర్చుకున్నారన్నదే కథ. జాగ్రత్తగా పరిశీలిస్తే ముగ్గురు మొనగాళ్లు చిత్రానికి ఇక్కడే నాంది పడ్డట్టు కనిపిస్తుంది.

  నాటి జ్ఞాపకాల్లో అమితాబ్

  నాటి జ్ఞాపకాల్లో అమితాబ్

  అమర్ అక్బర్ ఆంటోని సమయానికి అమితాబ్‌కు శ్వేత, అభిషేక్ బచ్చన్‌లు జన్మించారు. ఈ మూవీ షూటింగ్ సెట్‌లో వారిద్దరితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ అమితాబ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ‘శ్వేత, అభిషేక్ అమర్ అక్బర్ ఆంటోని సెట్‌కు వచ్చారు. ఆ సమయంలో మై నేమ్ ఈజ్ ఆంటోని అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఫోటో బీచ్‌ ముందు దిగాము.

  అలా మొదలైంది..

  అలా మొదలైంది..


  అమర్ అక్బర్ ఆంటోని విడుదలై 43 ఏళ్లు అవుతోంది. డైరెక్టర్ మన్‌మోహన్ గారు వచ్చి ఈ కథ, టైటిల్ చెప్పినప్పుడు.. ఈ సినిమా పోతుందని అనుకున్నాను. ఎందుకంటే ఆ సమయంలో అక్క వదిన కూతురు అంటూ ఇలాంటి టైటిల్స్‌తోనే సినిమాలు వచ్చేవి. కానీ ఈ సినిమా వాటన్నంటికీ భిన్నంగా వచ్చింది.

  ఆ రోజులెప్పుడో పోయాయ్..

  ఆ రోజులెప్పుడో పోయాయ్..

  ఆ సమయంలోనే ఇది దాదాపు 7.25 కోట్లు బిజినెస్ చేసినట్టు సమాచారం. అది ఇప్పటి ఇప్పటి విలువతో చూస్తే బాహుబలి 2 కలెక్షన్ల కంటే ఎక్కువేనని ట్రేడ్ విశ్లేషకులు అంటారు. అసలు నిజం ఏంటంటే.. 25 వారాలు ముంబైలోని 25 థియేటర్లలో ఏ ఒక్క సినిమా అయినా ఆడగలదా? అందుకే వారు అలా చెబుతుంటారు. ఆ రోజులు ఎప్పుడో పోయాయని.. ఇలాంటివి ఇప్పట్లో జరగవ'ని చెప్పుకొచ్చాడు.

  English summary
  Amitabh Bachchan Compares Amar Akbar Anthony Collections With Bahubali. He says That It is reported that it did a business of 7.25 cr at that time .. inflation adjusted it crosses collections of Bahubali 2 .. say the sayers who do calculations
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X