మన శంకర వరప్రసాద్ గారికి రికార్డ్ బిజినెస్? చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?

సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడికి గోల్డెన్ ఆఫర్ దక్కింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. చిరు కెరీర్‌లో 157వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్‌ను అనిల్ రావిపూడి పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

నిర్మాతగా చిరంజీవి కుమార్తె
సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. వీరితో పాటు కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Anil Ravipudi Megastar Chiranjeevi s Mana Shankara Vara Prasad Garu movie Sets Record Theatrical Business

ప్రమోషనల్ కార్యక్రమాల్లో అనిల్ రావిపూడి దూకుడు
ఇక తన సినిమాలకు అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్స్ చేయడంలో ముందుంటారు అనిల్ రావిపూడి. సినిమాలోని నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను కూడా ప్రమోషన్స్‌లో భాగం చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాంలో సీనియర్ సింగర్ రమణ గోగులను మళ్లీ పట్టుకొచ్చి ఆయనతో గోదారి గట్టు మీద రామ చిలక సాంగ్ పాడించారు. ఈ పాటే సినిమాకు సగం ప్రమోషన్స్ చేసేసింది. ఆ తర్వాత వెంకటేష్‌ తాను పాట పాడుతానంటూ బతిమలాడుతూ చేసిన ఫన్నీ స్కిట్ కూడా బాగా సెట్ అయ్యింది. ఇక ఎన్నో ఇంటర్వ్యూలు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనాల్లోకి బాగా తీసుకెళ్లారు అనిల్ రావిపూడి.

మీసాల పిల్ల సాంగ్‌తో భారీ హైప్
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు కోసం అలనాటి సింగర్ ఉదిత్ నారాయణ్‌ను దించారు అనిల్. ఆయన తనను తాను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చేసిన ఫన్నీ స్కిట్ బాగుంది. ఇక ఉదిత్ నారాయణ్ పాడిన మీసాల పిల్ల సాంగ్ మెగా అభిమానులను ఊపేస్తోంది. జనాల్లోకి వెళ్లిపోయిన ఈ సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై ఇప్పటికే హైప్ పెంచేశారు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చర్చనీయాంశమైంది.

చిరంజీవి మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్?
ఈ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా మన శంకర వరప్రసాద్ గారు థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అనిల్ రావిపూడి - చిరంజీవి మూవీకి రికార్డ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రాలో 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయలు, నైజాంలో 40 కోట్ల రూపాయల మేర మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 135 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ మార్కెట్‌తో కలిపి ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ 160 కోట్లపైనే చేస్తుందని భావిస్తున్నారు. మరి చిరంజీవి మూవీ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X