For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదే రోజా..ఇదేం ట్విస్ట్ : అనుష్క 'సైజ్‌ జీరో' రిలీజ్ తేదీ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సైజ్‌ జీరో'. 'సన్నజాజి నడుము' అనేది ఉపశీర్షిక. ఆర్య, భరత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మించారు. చిత్రాన్ని వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇదే రోజున అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రం సైతం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

  size zero-3

  నిర్మాత మాట్లాడుతూ ''బొద్దుగా కనిపించే ఓ అమ్మాయి అందమైన ఆకృతి కోసం ప్రయత్నించిన విధానం చుట్టూ సాగే కథ ఇది. తన నడుమును సన్నజాజి పువ్వులా మార్చుకొనేందుకు ఎలాంటి పాట్లు పడిందో తెరపైనే చూడాలి. వినోదమే ప్రధానంగా తెరకెక్కింది. ఆర్య, అనుష్క మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు, వినోదం ప్రేక్షకులకు నచ్చుతాయి. కీరవాణి సంగీతం, నీరవ్‌ షా కెమెరా పనితనం సినిమాని ప్రధాన బలం. చేసిన ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభించింది'' అన్నారు.

  ఈ నేపధ్యంలో ఈ చిత్రం డబ్బింగ్ ప్రారంభించారు. ఆటోనగర్ సూర్య, 100% లవ్ చిత్రాలతో పాపులర్ అయిన నందు ఈ చిత్రంలో హీరో క్యారక్టర్ ఆర్యకు డబ్బింగ్ చెప్పారు. అనుష్క ఈ సినిమా కోసం 20 కేజీల బరువు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గింది.

  size zero-2

  చిత్రం మరిన్ని విశేషాలకు వస్తే...

  తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ మేరకు రోజుకో పోస్టర్ చొప్పున విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడండి.

  అలాగే కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రం క్షత్రియ పుత్రుడులోని సన్నజాజి పడక పాటను అనుష్క,ఆర్యలపై రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట స్ఫూఫ్ మాత్రం కాదు..సినిమాలో ఓ సన్నివేశంలో ఆర్య,అనుష్క టీవిలో సన్నజాజి పడక సాంగ్ ని చూస్తూంటారు. తమని తాము ఆ పాటలో ఊహించుకుంటారు. సంప్రదాయ దుస్తుల్లో అప్పుడు వీరిద్దరూ ఉంటారు. ఇలా చేయటానికి ఇళయరాజా సైతం సమ్మతించినట్లు చెప్తున్నారు.

  పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.

  size zero-1

  ఇక హీరో ఆర్య ఇటీవల స్వీడన్ మీదుగా కఠినతరమైన సైకిల్ రైడ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సైజ్ జీరో నిర్మాతలు ఈ చిత్రంలో అలాంటి కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు.

  అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.

  English summary
  PVP Cinema has announced Anushka Starrer 'Size Zero', will be releasing on the 9th of October. Size Zero also has Arya, Sonal Chauhan, Prakash Raj, Urvashi and others in important roles. Directed by K S Prakash Rao and Produced by PVP Cinema, Size Zero has chart buster music by M M Keeravani and Nirav Shah handles the camera.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X