For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hero 1st Week Collections: మహేశ్ మేనల్లుడికి షాకింగ్ కలెక్షన్లు.. 6 కోట్లకు వచ్చింది ఇంతే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో చాలా మంది మొదటి చిత్రంతోనే భారీ సక్సెస్‌ను అందుకుంటున్నారు. కానీ, కొందరికి మాత్రం గ్రాండ్ ఎంట్రీ దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ 'హీరో' అనే చిత్రంతో హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  Recommended Video

  Mahesh Babu Fans Played Key Role In Hero Movie Blockbuster | Filmibeat Telugu

  ఈ చిత్రానికి ఆరంభం నుంచే మంచి టాక్ కూడా దక్కింది. కానీ, దీనికి అనుకున్న రీతిలో కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో 'హీరో' మూవీ మొదటి వారం ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

   ‘హీరో'గా ఎంట్రీ ఇచ్చిన గల్లా అశోక్

  ‘హీరో'గా ఎంట్రీ ఇచ్చిన గల్లా అశోక్

  గల్లా అశోక్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రమే ‘హీరో'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది.

  Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

  ‘హీరో' మూవీ బిజినెస్ వివరాలిలా

  ‘హీరో' మూవీ బిజినెస్ వివరాలిలా

  సంక్రాంతి బరిలో నిలిచిన ‘హీరో' సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. దీంతో నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 2.50 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 5.15 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ హక్కులు కలిపి రూ. 35 లక్షలతో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 5.50 కోట్ల మేర బిజినెస్ అయింది.

  రెస్పాన్స్ ఒకలా... కలెక్షన్లు మరొకలా

  రెస్పాన్స్ ఒకలా... కలెక్షన్లు మరొకలా

  ‘హీరో' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. హీరోగా పరిచయమైన సినిమానే అయినా అశోక్ గల్లా చాలా బాగా నటించాడన్న టాక్ వినిపించింది. అయితే, ఈ సినిమా టాక్‌కు అనుగుణంగా ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయింది. దీంతో దీనికి కలెక్షన్లు సోసోగానే వస్తున్నాయి. ఇక, ఏపీలో కర్ఫ్యూ పెట్టి ఆక్యూపెన్సీ తగ్గించడంతో మరింతగా పడిపోయాయి.

  దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  వారం రోజులకూ కలిపి వచ్చిందిలా!

  వారం రోజులకూ కలిపి వచ్చిందిలా!

  ‘హీరో' మూవీకి మొదటి వారం తెలుగు రాష్ట్రాలో కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలు.. 7 రోజుల్లో రూ. 1.88 కోట్లు షేర్, రూ. 3.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులకు రూ. 1.88 కోట్లు వసూలు చేసిన అశోక్ ‘హీరో' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశ పరిచింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 10 లక్షలను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రూ. 2.06 కోట్లు షేర్‌తో పాటు రూ. 4 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

   టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే

  టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే

  అశోక్ పరిచయం అయిన ‘హీరో' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో రూ. 2.06 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.94 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌‌ను సొంతం చేసుకుంటుంది.

  English summary
  Mahesh Babu nephew Ashok Galla Did Hero Movie Under Sriram Aditya Direction. This Movie Collects Rs 2.06 Crores in 1st Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X