»   » ‘అత్తారింటికి దారేది’ ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు

‘అత్తారింటికి దారేది’ ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ నెల 8వ తేదీతో విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకుంది. ఆరు వారాల్లో ఈచిత్రం మొత్తం రూ. 85.53 కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్‌లో సినిమా మరో 15 కోట్లు అవలీలగా వసూలు చేసి రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.

ఏరియా వైజ్ కలెక్షన్ డిటేల్స్

నైజాం - 25.22 కోట్లు
సీడెడ్ - 11.12 కోట్లు
వైజాగ్ - 7.39 కోట్లు
గుంటూరు - 6. 15 కోట్లు
ఈస్ట్ - 5.07 కోట్లు
కృష్ణా - 3.66 కోట్లు
వెస్ట్ - 3.35 కోట్లు
నెల్లూరు - 2.56 కోట్లు
మొత్తం ఏపి కలెక్షన్ - 59.52

ఓవర్సీస్ - 14.00 కోట్లు
కర్ణాటక - 5.40 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా - 1.61 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 85.53 కోట్లు

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Trivikram Srinivas' Telugu movie Attarintiki Daredi, which hit the screens across the globe on September 27, is still having good time at the ticket counters across the globe.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu