twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అత్తారింటికి దారేది' 50 పర్సంట్ కలెక్షన్స్ డ్రాప్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం సీమాంధ్ర ప్రాంతంలో 50 పర్సంట్ కలెక్షన్స్ డ్రాప్ అవటం గమనించామని విజయవాడ బ్రాంచ్ ఆఫ్ ఎపి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరి కె.శివప్రసాద్ మీడియాకు తెలియచేసారు. ఆయన ఓ పాపులర్ ఇంగ్లీష్ దినపత్రికతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేసారు

    శివప్రసాద్ చెప్పేదాని ప్రకారం...ఈ నాలుగు రోజులూ కేవలం మూడు రీజర్స్ తో భాక్సాఫీస్ వద్ద నిలబడింది. సమైఖ్యాంధ్ర ఉద్యమం కూడా ప్రక్కన పెట్టి ఎగ్జిబిటర్స్ కేవలం సింపతీ గ్రౌండ్స్ మీద ప్రదర్శింపచేసారు. సినిమా రిలీజ్ కు ముందు లీక్ అవటం సింపతీ జనరేట్ అయ్యింది. అంతేకాకుండా గత మూడు నెలలుగా ఏ పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కాకపోవటం కూడా ఓ కారణం అన్నారు.

    అలాగే శివప్రసాద్ మరో ముఖ్య కారణం చెప్తూ...సమైఖ్యాంధ్ర ఉధ్యమంతో సీమాధ్ర ప్రాంతంలో ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ అన్నీ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30 వరకూ క్లోజ్ చేసారు. దాంతో సెప్టెంబర్ 27న విడుదలైన ఈ భారీ బడ్జెట్ సినిమా హాలీడే మూడ్ తో వచ్చింది. ఇక ఈ రోజు కలెక్షన్స్ డ్రాప్ అవటానికి కారణం..ఉద్యమం కొనసాగుతోంది...ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఓపెన్ చేసారు. ఏ నేపధ్యంలో ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనేది ఆసక్తికరమైన అంశం అన్నారు.

    మరో ప్రక్క చిత్ర నిర్మాత...శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ అధినేత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ... ప్రజల్లో నిజాయితీ ఉందనేందుకు ఈ సినిమా విజయమే నిదర్శనమన్నారు. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. "ఈ ఏడాది అమెరికాలో విడుదలైన టాప్ 3 భారతీయ సినిమాల్లో 'అత్తారింటికి దారేది' ఒకటిగా నిలిచింది. ఒక దొంగ (పైరసీదారుడు) చేసిన పనిని తప్పని ప్రేక్షకులు నిరూపించారు. సినిమా విడుదలకు ముందు పైరసీ వచ్చిందని తెలియగానే పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరూ నన్ను ఓ తండ్రిగా చూసి, ధైర్యం చెప్పారు. ఈ సినిమాతో పవన్‌కల్యాణ్ మహానటుడనిపించారనేది నా అభిప్రాయం.సంతోషదాయకం'' అని ఆయన చెప్పారు.

    English summary
    'Attarintiki Daredi' which got huge openings is just about beginning to suffer the Samaikhyandhra heat. On Tuesday, the collections of the film were effected in the Seemandhra region though the going is good for the movie at the box-office in Telangana."A 50 per cent drop in the collections was noticed today," said K Sivaprasad, secretary, Vijayawada branch of A P Film Chamber of Commerce. According to Sivaprasad, the movie did well in the last four days because of three reasons. Film exhibitors chose to go ahead with releasing the movie despite the Samaikhyandhra movement on 'sympathy grounds'. Sivaprasad said the main reason why the film also did well in the Seemandhra region was that as part of the agitation, all educational institutions were closed from September 22 to September 30.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X