twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’తమిళ రీమేక్ రైట్స్ ఎంతకంటే

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగు నుంచి తమిళానికి,తమిళం నుంచి తెలుగుకు సినిమాలు వలస వెళ్లి రీమేక్ అవుతూండటం సర్వ సామాన్య విషయమే. రీసెంట్ గా ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం తమిళ నిర్మాతలను ఊరిస్తోంది. ఈచిత్రాన్ని రీమేక్ చేయడానికి పలువురు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని 4.5 కోట్లకు తమిళ రైట్స్ తీసుకున్నారని కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం. వేరే నిర్మాత కాకుండా స్వయంగా విజయ్‌ ఈ చిత్రం రైట్స్ తీసుకున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది.

    మేక్‌ చిత్రాల హీరోగా పేరు పొందిన ఇలయ తలబది విజయ్‌ మరో విజయవంతమైన చిత్రం 'అత్తారింటికి దారేది' రీమేక్ చేయటంతో ఆయన తన క్రేజ్ పెంచుకునేందుకు చూస్తున్నారు. ఆయన కెరీర్‌లోని గిల్లీ, పోక్కిరి, కావలన్‌, బద్రీ, వేలాయుధం వంటి భారీ విజయాలన్నీ రీమేక్‌లే కావటం విశేషం. ప్రస్తుతం 'జిల్లా'లో నటిస్తున్న విజయ్‌ తాజాగా టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చిత్రం చేస్తాననటంతో ట్రేడ్ వర్గాల్లో సైతం చాలా హిట్ గ్యారెంటీ అని, విజయ్ కు రీమేక్ లే అచ్చి వచ్చాయంటున్నారు.

    Attarintiki Daredi

    గతంలో పవన్‌కల్యాణ్‌ నటించిన 'తమ్ముడు' రీమేక్‌ 'బద్రీ'లో నటించి విజయాన్ని అందుకున్నాడు విజయ్‌. అంతే కాకుండా ఇటీవల పోక్కిరి, వేలాయుధం తదితర తెలుగు కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సెంటిమెంటుతోనే 'అత్తారింటికి దారేది' రీమేక్‌లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఇక సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది' చిత్రం రిలీజైన రోజు నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. త్వరలోనే ఈచిత్రం రూ. 100 కోట్లను అందుకుంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా దెబ్బకు గత తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

    పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఫ్యామిలీ, యూత్, క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రం ఉండటం సినిమాకు బాగా ప్లస్సయింది. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Vijay is willing to borrow Pawan’s storyline as Tamil remake. Recent Pawan-Trivikram combination blockbuster hit ‘Attarintiki Daredi’ is racing towards 100 Crore mark in Tollywood. It is learnt that Vijay is obtaining Tamil rights at a huge price. It is said that approximately Rs. 4.5 Crores has been exchanged.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X