»   » ‘ఆటో నగర్ సూర్య’ 3 డేస్ కలెక్షన్ ఎంత?

‘ఆటో నగర్ సూర్య’ 3 డేస్ కలెక్షన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేవా కట్ట లేటెస్ట్ డైరెక్షనల్ వెంచన్ 'ఆటో నగర్ సూర్య' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. తెలుగులో ప్రస్తుతం ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడంతో సినిమా యావరేజ్ టాక్ ఉన్నప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్లు ఫర్వాలదనిపించాయి.

గత సంవత్సర కాలంగా విడుదల ఇబ్బందులు ఎదుర్కొంటూ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ పడుతూ ఎట్టకేలకు విడుదలైన ఈచిత్రాన్ని.....తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా విడుదల చేసారు. విడుదలైన తొలి రోజు మార్నింగ్ షోకు ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా యావరేజ్‌గా 50% నుండి 60% ఆక్యుపెన్సీ సాధించింది. కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి. మధ్యాహ్నం , సాయంత్రం ఆటలకు బిజినెస్ పుంజుకుంది.

Autonagar Surya (3 Days) First Weekend Collection At Box Office

తొలి రోజు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో.....సినిమాను ట్రిమ్ చేసి విడుదల చేసారు. మరో వైపు తెలుగు సినిమా మార్కెట్లో 'ఊహలు గసగుసలాడే' తప్ప మరే చిత్రం కూడా పోటీ ఇచ్చే విధంగా లేక పోవడంతో దీంతో వారాంతంలో శని, ఆదివారాల్లో 'ఆటోనగర్ సూర్య' బిజినెస్ పుంజుకుంది.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తొలి వారాంతం(శుక్ర, శని, ఆది) ఈచిత్రం రూ. 6.85 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రూ. 2.2 కోట్లు, శనివారం రూ. 2 కోట్లు, ఆదివారం రూ. 2.65 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మరి తొలి వారం పూర్తయతేగానీ సినిమా పరిస్థితి ఏమిటో చెప్పలేం.

English summary
Deva Katta's latest directorial venture Autonagar Surya has received a decent opening in Andhra Pradesh and other parts of the globe. Despite facing tough competition from Hindi movie Ek Villain, the Naga Chaitanya and Samantha starrer political thriller has made a superb collection at the worldwide Box Office in the first weekend. It has topped the business chart in the state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu