Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Avatar 2 Collections: బ్రహ్మాస్త్ర, కాశ్మీర్ ఫైల్స్ రికార్డులను బ్రేక్ చేసిన అవతార్.. బాక్సాఫీస్ బీభత్సం!
జేమ్స్ కెమెరున్ అద్భుత సృష్టి అవతార్: ది వే ఆఫ్ వాటర్ మొదట నెగిటివ్ రివ్యూలు అందుకున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇండియాలో అయితే ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. హిందీ వెర్షన్ లో అయితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడది హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా మరో రికార్డును కూడా బ్రేక్ చేయనుంది. ఇక మొత్తంగా 11 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఎన్ని రికార్డులు బ్రేక్ చేసింది అని వివరాల్లోకి వెళితే..

ఫస్ట్ వీకెండ్ లోనే..
అవతార్ 2 సినిమాకు మొదటి వారంలోని అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేస్తోంది. అసలు ఫస్ట్ వీకెండ్ లో ఇండియాలో సినిమా అంతగా ఆడకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మొదటి వారంలోనే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

11వ రోజు అద్భుతమైన రెస్పాన్స్
ఇక రెండవ వారంలో సోమవారం రోజు కూడా ఇండియాలో ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. వీకెండ్ హాలిడేస్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా క్రిస్మస్ రోజు ఆదివారం కావడంతో మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా సోమవారం రోజు హిందీలో అయితే 11 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

తెలుగు కలెక్షన్స్
ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ రోజు కలెక్షన్స్ అయితే రెండు కోట్లకు తగ్గకుండా వస్తున్నాయి. 11వ రోజు కూడా 4.10 కోట్ల వసూలను అందుకోవడం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 11 రోజుల్లో ఈ సినిమా 70.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం.

మరో 10 కోట్లు వస్తే..
అవతార్ ది వే ఆఫ్ వాటర్ సోమవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం అయితే 264 కోట్ల రూపాయల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మరో 10 కోట్లను అందుకుంటే ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ళను అందుకున్న సినిమాగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ టార్గెట్ దిశగా అయితే అవతార్ 2 దూసుకుపోతోంది.

మొదటి స్థానంలో..
ఈ ఏడది బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ కలెక్షన్స్ అందుకున్న హిందీ సినిమాలలో బ్రహ్మాస్త్ర 269 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక తర్వాత ఇది కాశ్మీర్ ఫైల్స్ సినిమా 252 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక అజయ్ దేవగన్ దృశ్యం 224 కోట్లతో కొనసాగుతోంది. ఇప్పుడు అవతార్ 2 మరో 10 కోట్లను అందుకుంటే 270 కోట్ల కలెక్షన్స్ తో మొదటి స్థానంలో నిలుస్తుంది అని చెప్పవచ్చు.

అవేంజర్స్ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?
తప్పకుండా మొత్తంగా అయితే ఈ సినిమా ఇండియాలో 400 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంటుంది అని అనిపిస్తోంది. ఒకవేళ ఆ స్థాయిలో రికార్డులను అందుకుంటే ఇంతకుముందు అవెంజర్ ఎండ్ గేమ్ రికార్డును కూడా ఈ సినిమా బ్రేక్ చేసినట్లే అవుతుంది. ఎందుకంటే ఇండియా మొత్తంలో కూడా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ 373 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. మరి అవతార్ 2 ఆ రికార్డును ఇంకా ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తుందో చూడాలి.