Avatar 2 movie 10 Collections.. ప్రపంచవ్యాప్తంగా 7300 కోట్ల కలెక్షన్లు.. ఇప్పటి వరకు లాభం ఎంతంటే?

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ స్వీయ నిర్మాణంతోపాటు దర్శకత్వంలో వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం రెండో వారాంతాన్ని కూడా పూర్తి చేసుకొని భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది.

తెలుగు రాష్ట్రాలు, ఇండియా, ప్రపంచ దేశాలు అనే తేడా లేకుండా కాసుల కుంభవృష్టిని కురిపిస్తున్నది. డిసెంబర్ 16 తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్నది. ఈ సినిమా సాధించిన 10 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

2900 కోట్ల బడ్జెట్‌తో

2900 కోట్ల బడ్జెట్‌తో

అవతార్ 2 చిత్రం 350 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే భారతీయ కరెన్సీలో 2900 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం ఇండియాలోనే 3800 థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను తొలి వారంలో దాదాపు 17000 షోలు ప్రదర్శించారు. ఈ చిత్రం రిలీజైన ప్రతీ చోట భారీ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా..

అవతార్ 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి రోజున 13.65 కోట్ల షేర్ సాధించింది. రెండో రోజు 10.85 కోట్లు, మూడో రోజు 12.60 కోట్లు రాబట్టింది. గత తొమ్మిది రోజుల్లో మొత్తం 60 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక పదో రోజున ఈ చిత్రం 6.45 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, నైజాం, సీడెడ్‌లో కలిపి మొత్తం 66 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

10 రోజుల్లో ఏపీ, నైజాంలో వసూళ్లు

10 రోజుల్లో ఏపీ, నైజాంలో వసూళ్లు

అవతార్ 2 సినిమా గత 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం 35.45 కోట్లు, సీడెడ్‌లో 7.80 కోట్లు, ఆంధ్రాలో 22.83 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 66.10 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బలంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

10వ రోజు ఇండియా వైడ్ కలెక్షన్లు

10వ రోజు ఇండియా వైడ్ కలెక్షన్లు

ఇక ఇండియాలో అవతార్ 2 సినిమా 10వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. ఇంగ్లీష్ వెర్షన్ 11.5 కోట్లు, హిందీ వెర్షన్ 10 కోట్లు, తెలుగు వెర్షన్ 1.75 కోట్లు, తమిళంలో 1.35 కోట్లు, మలయాళం వెర్షన్ 55 లక్షల వసూళ్లను సాధించింది.ఈ చిత్రం 10 రోజున ఈ సినిమా 25.15 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

10 రోజుల్లో ఇండియా వైడ్ వసూళ్లు

10 రోజుల్లో ఇండియా వైడ్ వసూళ్లు

అవతార్ 2 సినిమా గత 10 రోజుల మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇంగ్లీష్ వెర్షన్ 131.55 కోట్లు, హిందీ వెర్షన్ 81.8 కోట్లు, తెలుగు వెర్షన్ 22.8 కోట్లు, తమిళనాడులో 13.5 కోట్లు, మలయాళంలో 3.2 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 252.85 కోట్ల వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రిపోర్టు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రిపోర్టు

ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఈ చిత్రం 880 మిలియన్ డాలర్లకుపైగా అంటే భారతీయ కరెన్సీలో 7300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో 253 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్‌లో 601 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 855 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 4400 కోట్ల రూపాయాల లాభాలను పంచిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X