Avatar 2 చరిత్ర సృష్టించిన అవతార్ 2.. జేమ్స్ కామెరాన్ ఖాతాలో ఎన్నివేల కోట్లంటే?

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ స్వీయ నిర్మాణంతోపాటు దర్శకత్వంలో వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నది. డిసెంబర్ 16వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రతీ చోట కాసులు వర్షం కురిపిస్తున్నది. పలు దేశాల్లో రికార్డు వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తున్నది. అయితే అవతార్ 2 చిత్రం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధించిన ఘనత, ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలోనే నంబర్ వన్ అవతార్

ప్రపంచంలోనే నంబర్ వన్ అవతార్

జేమ్స్ కామెరాన్ 2009వ సంవత్సరంలో అవతార్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పండోరా గ్రహాన్ని సృష్టించిన జేమ్స్‌కు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అప్పట్లో ఆ చిత్రం 2.92 బిలియన్ డాలర్లు అంటే.. అంటే 23 వేల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్లు. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లను బ్రేక్ సినిమా ఇంత వరకు రాలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తుంటాయి

అవతార్ 2 బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

అవతార్ 2 బ్రేక్ ఈవెన్ ఎంతంటే?


జేమ్స్ కామెరాన్ నిర్మించిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 16 వేల కోట్లు రాబట్టాలి. అయితే ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దారిదాపులోకి వచ్చింది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అవతార్ 2 తర్వాత అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2

అవతార్ సినిమా ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం హిందీ వెర్షన్ 128.32 కోట్లు, తమిళంలో 18 కోట్లకుపైగా, తెలుగులో 29 కోట్లు, ఇంగ్లీష్ వెర్షన్ 205 కోట్లు, మలయాళం 7 కోట్ల రూపాయలు సాధించింది. దాంతో ఈ సినిమా ఇండియాలో దాదాపు 390 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 కలెక్షన్లు

ఇక ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 సినిమా విషయానికి వస్తే.. పలు దేశాల్లో ఈ సినిమా ఇంకా బ్రహ్మండమైన కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు అమెరికా, కెనడాలో 15 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. చైనా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాద కొరియా, యూకేలో కలిపి 16 వేల కోట్ల రూపాయలు రాబట్టింది.

ప్రపంచంలోనే 6వ చిత్రంగా

ప్రపంచంలోనే 6వ చిత్రంగా


ఇక అవతార్ సినిమా బాక్సాఫీస్ లెక్కల వివరాల్లోకి వెళితే.. ప్రపంచ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా రికార్డులు తిరగరాసింది. అవతార్, అవెంజర్స్: ఎండ్ గేమ్, స్టార్ వార్స్: ఎపిసోడ్ 7, టైటానిక్, అవెంజర్స్: ఇనిఫినిటి వార్, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాలను అధిగమించింది. త్వరలోనే అవతార్ కలెక్షన్లను అధిగమించే ఛాయిస్ కూడా లేకపోలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అవతార్ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్

అవతార్ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్


అవతార్ సీక్వెల్స్ వివరాల్లోకి వెళితే.. అవతార్ 3 సీక్వెల్ డిసెంబర్ 20, 2024 తేదీన, అవతార్ సీక్వెల్ 4 డిసెంబర్ 18, 2026 తేదీన, అవతార్ 5 చిత్రం డిసెంబర్ 22, 2028 తేదీన రిలీజ్ చేసేందుకు జేమ్స్ కామెరాన్ ప్లాన్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X