For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ 'బాద్‌షా' హిందీ డబ్బింగ్ రైట్స్ రికార్డ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ని బాలీవుడ్ కి చెందిన మనీష్ గోల్డ్ మైన్స్ వారు 2.25 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. వారే గతంలో ప్రభాస్ రెబెల్ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని సైతం రెండు కోట్ల పదిహేను లక్షలకు సొంతం చేసుకున్నారు. హిందీ టీవి ఛానెల్స్ లో తెలుగు, తమిళ డబ్బింగ్ చిత్రాలుకు మంచి డిమాండ్ ఉంది. దాంతో అక్కడ పెద్ద సంస్దలు సైతం ఇక్కడ స్టార్ హీరోల చిత్రాల డబ్బింగ్ రైట్స్ కు పోటీ పడుతున్నాయి. గత చిత్రాలతో పోలిస్తే బాద్షా ది రికార్డు రేటుకు వెళ్లినట్లే అని చెప్తున్నారు.

  ఇక బాద్షా టీజర్ ట్రైలర్ ను శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ మీడియాలో పెద్ద సంచలనమే రేపింది. ఎన్టీఆర్ అభిమానులు తాము పండుగ చేసుకునే విధంగా ఉందని, సినిమా గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఈ టీజర్ చూసిన తర్వాత తమకు కలిగిందని అంటున్నారు. ఈ టీజర్ ఇప్పుడు టీవీ ఛానెల్స్ లోనే కాకుండా ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ,వెబ్ మీడియాలోనూ అంతటా ఎక్కడ చూసినా కనిపిస్తోంది.

  ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. దీంట్లో ఎన్టీఆర్‌ కొత్త తరహా కేశాలంకరణతో, ఫ్రెంచ్‌ గెడ్డంతో కనిపిస్తున్నారు. యాక్షన్‌ అంశాలకు పెద్దపీట వేసినట్లు అర్థమవుతుంది. 'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' అనే డైలాగ్‌ పలికారు ఎన్టీఆర్‌. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత.

  ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

  ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు.

  English summary
  
 NTR's 'Badshah'film's Hindi dubbing rights have been bagged by Manish Gold Mines for Rs Rs 2.25 crs. Young hero Navdeep is playing powerful antagonist role in the film whose music is tuned by Thaman. Major portions of the shooting will take place in December,January and February. Two songs Finished. Producer planning release in March end.”.Bandla Ganesh is producing the film on Parameswara Arts banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X