Baaghi 4 Day 1 Box Office: కేసరి 2, సన్ ఆఫ్ సర్దార్ 2 రికార్డ్‌లు ఔట్.. సంజయ్ దత్ మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీలో భాఘి ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడు సినిమాలు రాగా.. తాజాగా బాఘి 4 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, హర్నాజ్ సంధూలు లీడ్ రోల్ పోషించారు. సెప్టెంబర్ 5న బాఘి 4 వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో భాఘి 4 సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు సంజయ్ దత్ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే..
బాఘి 4 తారాగణం
భాఘి 4ను నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్‌వాలా నిర్మించారు. సోనమ్ బజ్వా, శ్రేయాస్ తల్పడే, పవన్ శంకర్, ఉపేంద్ర లిమాయే, సౌరబ్ సచ్‌దేవ, షీబా అక్షదీప్ సబీర్, మహశ్ ఠాకూర్, సునీత్ మోరార్జీలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కిరణ్ గౌడ, నితిన్ పాఠక్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. సంచిత్, అంకిత్ బల్హారాలు సంగీతం అందించారు. స్వామి జే గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

బాఘి 4 బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి భాఘి 4 సినిమాకు 70 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. బాఘి ఫ్రాంఛైజ్‌కి ఉన్న బ్రాండ్ వాల్యూను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ విలువలు, టెక్నికల్ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా సాజిద్ నదియాడ్‌వాలా బాఘి 4 సినిమాను నిర్మించారు. ముంబైతో పాటు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.
బాఘి 4 కలెక్షన్స్
టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్‌ల మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లో మంచి జోరు కనిపించింది. తొలిరోజు ప్రీ సేల్స్‌లో ఇప్పటికే అజయ్ దేవగణ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2, అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 రికార్డులను దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బాఘి 4కి దాదాపు 2.85 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఫస్ట్ డే ప్రీ సేల్స్‌లో 1.18 లక్షల రూపాయల టికెట్లు బుక్ అయినట్లు పేర్కొంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో మహారాష్ట్రలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కినట్లుగా విశ్లేషకులు తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో మంచి ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా చెబుతున్నారు.
బాఘి 4 తొలి రోజు కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. సాయంత్రం 6 గంటల వరకు హిందీలో 25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు ముంబైలో 717 షోలు, ఢిల్లీలో 939, అహ్మదాబాద్‌లో 468 షోలు, పుణేలో 315 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ బాగుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు బాఘి 4 .. ఉత్తరాది రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున ఫస్ట్ డే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











