Bhaagi 4 Day 14 Collections: 2 వారాల్లో బాఘి 4 కలెక్షన్లు.. 14వ రోజు ఎంత? ఇంకెత రాబట్టాలంటే?
2 వారాల పాటు బాఘి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇక ఈ చిత్రంలో
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ ప్రధాన ప్రాతల్లో నటించారు. ఈ యాక్షన్ ఫిల్మ్ కు రాజత్ ఆరోరా కథను, సాజిద్ నడిదయావాల స్క్రీన్ ప్లేను అందించారు. ఏ హర్ష దర్శకత్వం వహించడం విశేషం. నిర్మాత సాజిద్ నదియవాలా నదియావాల గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మించారు. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2 వారాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో బాఘి 4 సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 14వ రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
బాఘి 4 బడ్జెట్?
బాలీవుడ్ టాప్ స్టార్స్ సంజత్ దత్, టైగర్ ఫ్రాష్, సోనమ్ బజ్వా నటించడం, ప్రముఖ నటులు శ్రేయాస్ తల్పడే, పవన్ శంకర్, మహశ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించడం.. స్వామి జే గౌడ సినిమాటోగ్రాఫర్‌గా, కిరణ్ గౌడ -నితిన్ పాఠక్‌లు ఎడిటర్లుగా, సంచిత్, అంకిత్ బల్హారాలు సంగీతం దర్శకులుగా పనిచేయడంతో కాస్తా బడ్జెట్ ఎక్కువనే అయ్యింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషన్ ఖర్చులన్నీ కలుపుకొని రూ.70 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.

ప్రీరిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్?
యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ బాఘి 4 ఇండియాతో పాటు ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రానికి ముందు వచ్చిన బాఘి సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ పర్లేదు అనేలా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.70 కోట్ల షేర్, రూ.140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫిక్స్ చేశారు.
బాఘి 4 14 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.12 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.9.25 కోట్లు, 3వ రోజు రూ.10 కోట్లు, 4వ రోజు రూ.4.5 కోట్లు, 5వ రోజు రూ.4 కోట్లు, 6వ రోజు రూ.2.65 కోట్లు, 7వ రోజు రూ.2.1 కోట్లు, 8వ రోజు రూ.1.25 కోట్లు, 9వ రోజు రూ.1.75, 10వ రోజు రూ.2.15 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు ద్వారా తెలుస్తోంది.
ఇక 11వ రోజు రూ.75 లక్షలు నెట్, 12వ రోజు రూ.95 లక్షల నెట్, 13వ రోజు రూ.75 లక్షల నెట్, 14 రోజు రూ.50 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ అందించింది. దీంతో ఇండియా నెట్ రూ.53 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ. 63 కోట్లు, ఓవర్సీస్ లో రూ.15 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. దీంతో ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.78 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది.
నష్టాలు తప్పాలంటే..
బాఘి 4 చిత్రానికి వీకెండ్స్ లో కాస్తా జోరుగానే వసూళ్లు దక్కుతున్నాయి. ఇక వర్క్ డేస్ లోనూ రూ. 1కోటి గ్రాస్ కు తగ్గకుండా వసూళ్లు సాధిస్తోంది. దీంతో 3వ వారం కూడా బాగానే పెర్ఫామ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా బాఘి 4 లాభాల్లోకి రావాలంటే రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని, ఇప్పటి వరకుఅందిన వసూళ్లు కాకుండా ఇంకా రూ.60 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాలని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











