Baaghi 4 Day 2 Box Office: బాఘి 4 చిత్రం 2వ రోజు కలెక్షన్స్.. టైగర్ ష్రాఫ్ దూకుడు.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ బాఘి 4. ఈ చిత్రానికి ఏ హర్ష దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాఘి ఫ్రాంచైజీ నుంచి 3 పార్ట్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మంచి స్పందనను అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రాలకు మంచి రిటర్స్ కూడా అందాయి. దీంతో సిరీస్ లను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి పార్ట్ కు మరింత యాక్షన్ డోన్ ను పెంచుతూ, కథను, సినిమా నిర్మాణ పరిధిని పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలో బాఘి 4 సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ స్కేల్లో విడుదలైంది. ఈ సందర్భంగా బాఘి 4 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు సాధించనేది వివరాల్లో వెళితే..
బాఘి 4 బడ్జెట్ ఎంత?
ఈ చిత్రాన్ని నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా నిర్మించారు. సంజత్ దత్, టైగర్ ఫ్రాష్ లతో పాటు సోనమ్ బజ్వా, శ్రేయాస్ తల్పడే, పవన్ శంకర్, సౌరబ్ సచ్‌దేవ, షీబా అక్షదీప్ సబీర్, మహశ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించారు. స్వామి జే గౌడ సినిమాటోగ్రాఫర్‌గా, కిరణ్ గౌడ, నితిన్ పాఠక్‌లు ఎడిటర్లుగా, సంచిత్, అంకిత్ బల్హారాలు సంగీతం అందించారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలు అన్నీ కలుపుకొని రూ.70 కోట్ల పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

ప్రీరిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్?
స్టార్ హీరోలు, టాప్ టెక్నీషియన్లు, భారీ యాక్షన్లు కలిగిన చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల షేర్, రూ.140 కోట్ల వరల్డ్ గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటితేనే సినిమా లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
బాఘి 4 డే1, డే2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
బాఘి 4 చిత్రం ఓపెనింగ్ డే రూ.12 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇండియా గ్రాస్ రూ.14.15 కోట్లు వసూలైంది. ఇక ఓవర్సీస్ లో రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇలా వరల్డ్ వైడ్ గా డే1 రూ.17.15 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్టుగా సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 2వ రోజు సాయంత్రం 7 గంటల వరకు ఈ చిత్రం ఇండియా నెట్ రూ.4 కోట్లు వసూళ్లు చేసింది. మిగితా షోలతో కలుసుకొని రూ.6 కోట్ల ఇండియా నెట్ రూ.8 కోట్ల గ్రాస్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలా 2 రోజుల్లో ఇండియా నెట్ రూ.18 కోట్లకు చేరుకుంటుందని, ఇండియా గ్రాస్ రూ.30 కోట్లకు పైగా వసూలవుతుందని అంటున్నారు. ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో రూ.35 కోట్ల వరకు వసూలయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











