Baaghi 4 Day 7 Box Office: బాఘి 4 వారం రోజుల కలెక్షన్లు.. ఇంకెన్ని కోట్లు రాబట్టాలంటే?
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ బాఘి 4. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ బాఘి 3, బాఘి 2, బాఘి చిత్రాలతో గతంలో అలరించిన సంగతి తెలిసిందే. ఈ హిట్ ఫ్రాంచైజీ నుంచి తాజాగా బాఘి 4. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఏ హర్ష డైరెక్ట్ చేశారు. సాజిద్ నడిదయావాల, రాజత్ ఆరోరా కథను అందించారు. నదియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాత సాజిద్ నదియవాలా నిర్మించారు. బాఘి 4 సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? 7 రోజుల్లో రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు సాధించనేది వివరాల్లో వెళితే..
బాఘి 4 బడ్జెట్ ఎంత?
ఈ చిత్రంలో భారీ తారాగణం సంజత్ దత్, టైగర్ ఫ్రాష్, సోనమ్ బజ్వా, శ్రేయాస్ తల్పడే, పవన్ శంకర్, సౌరబ్ సచ్‌దేవ, షీబా అక్షదీప్ సబీర్, మహశ్ ఠాకూర్ నటించారు. అలాగే టాప్ టెక్నీషియన్లు స్వామి జే గౌడ సినిమాటోగ్రాఫర్‌గా, కిరణ్ గౌడ -నితిన్ పాఠక్‌లు ఎడిటర్లుగా, సంచిత్, అంకిత్ బల్హారాలు సంగీత దర్శకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలు కలుపుకొని సినిమాకు రూ.70 కోట్ల పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

ప్రీరిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్?
భారీ యాక్షన్లు కలిగిన చిత్రం కావడం, స్టార్ హీరోలు, టాప్ టెక్నీషియన్లు పనిచేడయంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ మాదిరిగా జజరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.70 కోట్ల షేర్, రూ.140 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉందని ట్రేడ్ పండింతులు విలువ కట్టారు.
బాఘి 4 వారం రోజుల వసూళ్లు..
ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓపెనింగ్ డే రూ.12 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.9.25 కోట్లు, 3వ రోజు రూ.10 కోట్లు, 4వ రోజు రూ.4.5 కోట్లు, 5వ రోజు రూ.4 కోట్లు, 6వ రోజు రూ.2.65 కోట్లు, 7వ రోజు రూ.2.1 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇలా మొదటి వారం పూర్తయ్యే సరికి ఇండియా నెట్ రూ.44.5 కోట్లకు చేరుకుంది.
7 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్..
సెప్టెంబర్ 12 వరకు వారం రోజుల్లో జోరుగా వసూళ్లను సాధించింది. 7 రోజుల్లో ఇండియా నెట్ రూ.44.50 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ రూ.63.50 కోట్లకు చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో రూ.10.25 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇలా ఇండియా గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.53.25 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ చిత్రం ఇంకా రూ.80 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











