Baaghi 4 Day 8 Collections: ట్రైగర్ ష్రాఫ్‌కు నష్టాలు తప్పవా? 70 కోట్ల బడ్జెట్ పెడితే ఎంత వసూలైందంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ లేటెస్ట్ ఫిల్మ్ బాఘి 4. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి గతంలో బాఘి 3, బాఘి 2, బాఘి సిరీస్ లు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన చిత్రమే బాఘి 4. ఈ చిత్రానికి ఏ హర్ష దర్శకత్వం వహించారు. సాజిద్ నడిదయావాల, రాజత్ ఆరోరా కథ, స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. నదియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాత సాజిద్ నదియవాలా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? 8వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూల్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
బాఘి 4 బడ్జెట్ ఎన్ని కోట్లు?
సంజత్ దత్, టైగర్ ఫ్రాష్, సోనమ్ బజ్వా వంటి స్టార్ కాస్ట్ తో పాటు, శ్రేయాస్ తల్పడే, పవన్ శంకర్, సౌరబ్ సచ్‌దేవ, షీబా అక్షదీప్ సబీర్, మహశ్ ఠాకూర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. స్వామి జే గౌడ సినిమాటోగ్రాఫర్‌గా, కిరణ్ గౌడ -నితిన్ పాఠక్‌లు ఎడిటర్లుగా, సంచిత్, అంకిత్ బల్హారాలు సంగీత దర్శకులుగా వ్యవహరించారు. దీంతో నటీనటులు, టాప్ టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చు, ప్రమోషన్ వ్యవం కలుపుకొని సినిమాకు రూ.70 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ప్రీరిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్?
ఈ భారీ యాక్షన్ మూవీకి సహజంగానే హిందీ మార్కెట్ లో బజ్ ఏర్పడింది. యాక్షన్ ఫిల్మ్ కావడంతో ఓవర్సీస్ లోనూ మంచి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.70 కోట్ల షేర్, రూ.140 కోట్ల వరల్డ్ గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించాయి.
బాఘి 4 8 రోజుల ఇండియా నెట్..
ఓపెనింగ్ డే రూ.12 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.9.25 కోట్లు, 3వ రోజు రూ.10 కోట్లు, 4వ రోజు రూ.4.5 కోట్లు, 5వ రోజు రూ.4 కోట్లు, 6వ రోజు రూ.2.65 కోట్లు, 7వ రోజు రూ.2.1 కోట్లు, 8వ రోజు రూ.1.25 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
8 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
మొదటి వారం బాఘి 4 చిత్రం మంచి వసూళ్లనే అందుకుంది. వారం రోజుల్లో రూ.44.5 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసింది. ఇక 8వ రోజుతో కలుపుకొని ఇండియా నెట్ రూ.46 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.55 కోట్లు కలెక్ట్ చేసిందని, ఓవర్సీస్ లో ఈ చిత్రానికి రూ.11 కోట్లు వసూలైనట్టు సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో ఇండియా+ఓవర్సీస్ కలుపుకొని 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.66 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
లాభాల్లోకి వస్తుందా?
ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.140 కోట్ల వరకు కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ వాల్యూనూ నిర్ణయించారు. ఈ లెక్కన ఇప్పటి వరకు రూ.66 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైంది. దీంతో ఇంకా ఈ చిత్రం రూ.74 కోట్ల వరకు వసూల్ చేయాల్సి ఉంది. గడిచింది 1వ వారమే కావడంతో 2వ వారంలో వసూళ్లను బట్టి లాభామా? నష్టమా? అనేది తేలనుంది. 2వ వారం వసూళ్లు ఎలా ఉన్నా చిత్రం మాత్రం సేఫ్ జోన్ లోకి వస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వస్తున్నారు.


Click it and Unblock the Notifications











