»   » చట్ట విరుద్ధం: బాహుబలి-2 షోలు రద్దు చేయాలంటూ డిమాండ్!

చట్ట విరుద్ధం: బాహుబలి-2 షోలు రద్దు చేయాలంటూ డిమాండ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' సినిమా కోసం తెలుగు ప్రజలంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు. ఎన్ని థియేటర్లలో షోలు వేసినా చాలా మందికి ఇంకా టికెట్స్ దొరకలేదు. ఈ సమస్యను తీర్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుండి అదనపు షోలకు అనుమతి తీసుకున్నారు నిర్మాతలు.

అయితే బాహుబ‌లి-2 సినిమా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రోజుకి ఆరు షోలకు అనుమతి ఇవ్వ‌డం వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని సినీ ప్రేక్షకుల సంఘం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

చట్ట విరుద్ధం

చట్ట విరుద్ధం

ఏపీ సినీ ప్రేక్షకుల సంఘం బాహుబలి 2 చిత్రానికి అదనపు షోలకు అనుమతి ఇశ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధను కలిసారు. ఈ విధంగా అదనపు షోలకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధమని, వెంటనే ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.

 చట్టాన్ని పట్టించుకోవడం లేదు

చట్టాన్ని పట్టించుకోవడం లేదు

థియేటర్లలో షోల ప్రదర్శన వేళలపై చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 8 గంటల వరకూ ప్రదర్శనలు ఉండరాదని అందులో ఉంద‌ని... అలాంటపుడు రాత్రి 2 గంటల వరకు షోలు నడిచేలా ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు.

అవసరమైతే కోర్టుకు

అవసరమైతే కోర్టుకు

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అనురాధ తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంసపై వెంటనే స్పందించక పోతే కోర్టును ఆశ్రయిస్తామని సినీ ప్రేక్షకుల సంఘం హెచ్చరించింది.

ఎక్కడ చూసినా బాహుబలి 2 ఫీవర్

ఎక్కడ చూసినా బాహుబలి 2 ఫీవర్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బాహుబలి 2 మూవీ ఫీవర్ మొదలైంది. మరో మూడు రోజుల్లో సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో సినిమా టికెట్ల వేటలో పడ్డార ప్రేక్షకులు. బాహుబలి 2కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Baahubali 2 controversy over Extra Shows. AP Govt Allows 6 Shows Daily for 'Bahubali 2'. This decision is opposed by the Film Audience Association.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu