»   » బాహుబలి 2 ట్రైలర్ మరో ఆలిండియా రికార్డ్, ప్రపంచ స్థాయిలో 13, 7వ స్థానం!

బాహుబలి 2 ట్రైలర్ మరో ఆలిండియా రికార్డ్, ప్రపంచ స్థాయిలో 13, 7వ స్థానం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి 2 మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై ఎవరూ ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వ్యూస్ పరంగా ఇప్పటి వరకు ఇది 85 మిలియన్ (8.5 కోట్లు) రీచ్ అయింది. ఇది మాత్రమే కాదు... యూట్యూబ్ లో లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఇండియాలో మోస్ట్ లైక్డ్ ట్రైలర్ గా సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఈ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మళయాలం వెర్షన్స్ కలిపి 1 మిలియన్ లైక్స్ మార్కును దాటేసింది. కేవలం 3 రోజుల్లోనే ఈ మార్కును అందుకుంది.

మోస్ట్ లైక్

మోస్ట్ లైక్

బాహుబలి ట్రైలర్ ఇండియాలోనే అత్యధికంగా లైక్ చేసిన ట్రైలర్ గా నిలవడం ఆనందంగా ఉదంటూ ఇందుకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

85 మిలియన్ వ్యూస్

85 మిలియన్ వ్యూస్

వ్యూస్ పరంగా కూడా బాహుబలి ట్రైలర్ ఇండియాలోనే అత్యధికంగా చూసిన ట్రైలర్ గా నిలిచింది. ఫేస్ బుక్, యూట్యూబ్ లో విడుదల చేసిన తెలుగు, హిందీ, తమిళం, మళయాలం బాషల్లో కలిపి ఇప్పటి వరకు ఓవరాల్ గా 8.5 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

 ప్రపంచ స్థాయిలో 13వ స్థానం

ప్రపంచ స్థాయిలో 13వ స్థానం

వికీపీడియా కథనం ప్రకారం.... తొలి 24 గంటల్లో భారీగా వ్యూస్ సొంతం చేసుకున్న వరల్డ్ వైడ్ ఆన్ లైన్ వీడియోల లిస్టులో బాహుబలి 2 ట్రైలర్(50 మిలియన్) 13వ స్థానంలో ఉంది.

 యూట్యూబ్ పరంగా 7వ స్థానం

యూట్యూబ్ పరంగా 7వ స్థానం

ఇక యూట్యూబ్ పరంగా తొలి 24 గంటల్లో భారీగా వ్యూస్ సొంతం చేసుకున్న ప్రపంచ వీడియోల లిస్టులో బాహుబలి ట్రైల్ 7వ స్థానంలో నిలిచింది.

 ‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

ఈ మధ్య కాలంలో లీక్ వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ముందే సినిమాలోని క్లిప్స్ లీక్ కావడం, స్టోరీ లీక్ కావడం, కొన్ని సార్లు సినిమా మొత్తం లీక్ కావడం లాంటివి జరుగుతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతంగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో అత్యంత వేగంగా ఈ లీక్ స్టఫ్ అందరికీ షేర్ అవుతోంది. తాజాగా బాహుబలి-2 కథ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. వాట్సాఫ్, ఫేస్ బుక్ ద్వారా ఇది వైరల్ అయింది.

అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. ః

ఫస్ట్ పార్టును తలదన్నేలా వ్యూస్

2015లో విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఇప్పటి వరకు అది 78.41లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుంది. అయితే బాహుబలి 2 ట్రైలర్ అంతకు పది రెట్లు రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

English summary
'Baahubali: The Conclusion' has reached yet another huge milestone. It is now officially India's Most Liked Trailer. The Total Likes for the Trailers in Telugu, Hindi, Tamil & Malayalam versions crossed 1 Million mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu