twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి-2 షోలు ముందే బ్లాక్ చేస్తున్నారా? లక్షల్లో చెల్లింపులు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి-ది బిగినింగ్' మూవీ 2015లో విడుదలైనపుడు బాక్సాఫీసు వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అప్పట్లో దాదాపు వారం ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా... బాక్సాఫీసు వద్ద జాతరలాంటి వాతావరణం నెలకొంది.

    అప్పట్లో బాహుబలి టికెట్లు బ్లాక్ మార్కెటింగ్ కూడా జోరుగానే సాగింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం కుమ్మక్కయి టికెట్లును భారీ ధరకు అమ్మారంటూ ఆరోపణలు, కేసులు, థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తుతో టిక్కెట్ల అమ్మకం లాంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

    బాహుబలి 2

    బాహుబలి 2

    అప్పట్లోనే పరిస్థితి అలా ఉందంటే బాహుబలి 2 రిలీజ్ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని ముందే ఊహించిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి నుండే బిజినెస్ మొదలు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    భారీగా హైర్

    భారీగా హైర్

    బాహుబలి 2 సినిమాకు సంబంధించి భారీగా థియేటర్స్ హైర్స్ జరుగుతున్నాయని, సినిమా రిలీజ్ కు నెల రోజుల సమయం ఉండగా ఇప్పటి నుండే గంపగుత్తగా షోలను అమ్ముతున్నారని, ఒక్కో షో రూ. 10 నుండి 12 లక్షలకు అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    బ్లాక్ మార్కెటింగ్ లాంటిదే?

    బ్లాక్ మార్కెటింగ్ లాంటిదే?

    సినిమా టికెట్లను నిర్ణయించిన ధరకు కాకుండా థియేటర్స్ హైర్స్ రూపంలో ఇలా ఎక్కువ ధరకు గంపగుత్తగా అమ్మడం కూడా.... బ్లాక్ మార్కెటింగ్ లాంటిదే ఆనే ఆరోపణలే వినిపిస్తున్నాయి.

    భారీ ధరకు రైట్స్, తిరిగి రావాలంటే తప్పదు

    భారీ ధరకు రైట్స్, తిరిగి రావాలంటే తప్పదు

    నైజాం లాంటి ఏరియాల్లో సినిమా రైట్స్ రూ. 50 కోట్లుకు అమ్ముడయ్యాయి. ఇతర ఏరియాల్లో కూడా రికార్డు స్థాయిలోనే అమ్ముడయ్యాయి. పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడంలో భాగంగానే డిస్ట్రిబ్యూటర్లు ఇలా గంపగుత్తగా టికెట్స్ అమ్మకం సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    తొలి రోజు వసూళ్ల అంచనా

    తొలి రోజు వసూళ్ల అంచనా

    బాహుబలి 2 మూవీ తొలి రోజు తెలుగు వెర్షన్ టాలీవుడ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 40 కోట్ల షేర్ సాధిస్తుందనే అంచనా వేస్తున్నారు.

    వసూళ్ల వరదే

    వసూళ్ల వరదే

    బాహుబలి 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6500లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి 2 మూవీ ఇండియన్ సినీ చరిత్రలో రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలవడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బాహుబలి తొలి భాగం రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Trade Circles say, 'Khaidi No.150' holds the Day 1 record with a share of Rs 23.24 crore in Telugu States. 'Baahubali 2' is expected to collect Rs 40 crore Share on Day 1 itself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X