»   »  'బాహుబలి' ఇంకో రికార్డ్, దేశంలో ఇప్పటివరకూ ఏ సినిమాకు రానిది

'బాహుబలి' ఇంకో రికార్డ్, దేశంలో ఇప్పటివరకూ ఏ సినిమాకు రానిది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్ లు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు మరో రికార్డ్ బాహుబలి ఖాతాలో చేరింది. ఈ చిత్రం తాజాగా 15 ఫారిన్ బ్లాక్ బస్టర్స్లో.. స్థానం సంపాదించగా.. బాహుబలి యూనిట్ కి హాలీవుడ్ విషెస్ చెప్పింది. ఈ విషయాన్ని బాహుబలి యూనిట్ సగర్వంగా తమ సోషల్ నెట్ వర్కింగ్ ఖాతాలో షేర్ చేసింది.


అంతేకాకుండా ఈ చిత్రం గురించి చాలా గొప్పగా రాసుకొచ్చింది. బాహుబలి కథ, కథనం,స్టార్ కాస్టింగ్, థ్రిల్లర్ ని తలపించే యుద్ధ సన్నివేశాలు.. అద్భుతమైన సంగీతం.. ఒకటేంటి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాహుబలి- ద బిగినింగ్ కన్ను తిప్పుకోనీయదని.. లార్జర్ కాన్వాస్ తో రాజమౌళి సృష్టించిన అద్భుతమైన కళాఖండమంటూ బాహుబలిపై స్క్రీన్ రాంట్ అనే ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ పొగడ్తల వర్షం కురిపించింది.

ఇక లెజండరీ జపనీస్ ఫిల్మ్ మేకర్ అకీరా కురోసవా తీసిన రాన్ మూవీ ఈ లిస్ట్ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రతిష్టాత్మక సంస్థ నుంచి కాంప్లిమెంట్స్ రావడంతో బాహుబలి మేకర్స్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకొన్నారు.


Baahubal

బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఇంతర భారీ మొత్తం వసూళ్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అనే ఒక వాదన ఉండేది. సౌత్ సినిమాలకు కూడా ఆ సత్తా ఉందని బాహుబలి సినిమా నిరూపించింది.


బాహుబలి పార్ట్ 1 విడుదల సందర్భంగా తెలుగునాట థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అలాంటి ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్ లాంటివి జరుగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేయనున్నారు.


మరో ప్రక్క పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.


రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో 'బాహుబలి'ని విడుదల చేసిన కరణ్‌... రెండో పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ హిందీ వర్షెన్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు.


English summary
SS Rajamouli's epic masterpiece 'Baahubali: The Beginning' has been named among the '15 Foreign Blockbusters Hollywood Wishes They'd Made'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu