Baahubali The Epic Day 1 Collections: బాహుబలి ది ఎపిక్ తొలి రోజు కలెక్షన్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.

ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ఒకే భాగం చేసి ది బాహుబలి: ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నమోదైన ప్రీ సేల్స్ కలెక్షన్లు ఎంత? తొలి రోజు వసూళ్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Baahubali The Epic Day 1 Expected Box Office Collections

బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 650 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా మొత్తం థియేట్రికల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో కలిపి 203 కోట్ల రూపాయల షేర్, 295 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 107 కోట్లు, తమిళనాడులో 127 కోట్లు, కేరళలో 62 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 10 కోట్లు, నార్త్ ఇండియాలో 514 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 1400 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి రెండు భాగాలను కలిపి రూపొందించిన బాహుబలి ది ఎపిక్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అనూహ్యమైన రెస్పాన్స్ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. రీ రిలీజ్ సినిమాల్లో విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక బాహుబలి ది ఎపిక్ చిత్రానికి విడుదలైన ప్రతీ చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు, కరెంట్ బుకింగ్‌కు భారీ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 10 కోట్ల రూపాయలు, హిందీ మార్కెట్‌లో 2 కోట్ల రూపాయలు, ఇతర భాషల్లో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుంది. ఇండియాలో మొత్తంగా 15.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. అమెరికా, ఇతర దేశాల్లో ఈ చిత్రం 10 కోట్ల వరకు వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 25.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దర్శకుడు రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం బాహుబలి ది ఎపిక్ సినిమా భారీగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో సునాయసంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇదే జోష్ కొనసాగిస్తే.. 150 కోట్ల మైలురాయిని, అలాగే 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X