Baahubali The Epic Day 2 Collections: బాహుబలి ది ఎపిక్ వసూళ్ల విధ్వంసం.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 2500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ సత్తాను చాటి చెప్పింది. అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాయడంతో పాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలను కలిపి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రీ రిలీజ్‌లోనూ బాహుబలి సంచలన వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు బాహుబలి ది ఎపిక్ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
బాహుబలి తారాగణం
బాహుబలి సిరీస్‌లో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజ్, అడవి శేష్, రోహిణి, కల్పలత, రోహిణి, తనికెళ్ల భరణి, ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించగా.. నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

తొలిరోజు బాహుబలి ది ఎపిక్ వసూళ్లు
బాహుబలి ది ఎపిక్‌కి ఇండియా వైడ్‌గా తొలిరోజు 10.4 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 12.35 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో అత్యధిక మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే కావడం గమనార్హం. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 1.15 కోట్ల రూపాయల నెట్ రాబట్టిన బాహుబలి ది ఎపిక్.. రిలీజ్ రోజు 9.25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇందులో తెలుగు నుంచి 8.65 కోట్ల రూపాయలు, హిందీ నుంచి 1.4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 20 లక్షల రూపాయలు, మలయాళంలో 15 లక్షల రూపాయు చొప్పున వసూలు చేసింది బాహుబలి.
బాహుబలి ది ఎపిక్ ఓవర్సీస్ కలెక్షన్స్
రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ కోసం నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడయ్యాయి. బాహుబలి ది ఎపిక్‌కి నార్త్ అమెరికా అక్టోబర్ 31వ తేదీ రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 100K (భారత కరెన్సీలో దాదాపు 89 లక్షల రూపాయలు) డాలర్లు వచ్చింది. దాంతో ప్రీమియర్స్ + డే 1 కలిపి నార్త్ అమెరికాలో 2 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్స్ రాగా.. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో మరో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలి రోజు ఓవర్సీస్‌లో ప్రభాస్ మూవీకి 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి బాహుబలి ది ఎపిక్ తొలి రోజు 16.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఈ కలెక్షన్స్‌తో రీ రిలీజ్‌లలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఉన్న గబ్బర్ సింగ్ (5.08 కోట్ల రూపాయలు) రికార్డును బాహుబలి ది ఎపిక్ అధిగమించింది. ఇక రీ రిలీజ్‌లలో అత్యధిక మొత్తం వసూలు చేసిన సినిమాగా ఉన్న ఇళయ దళపతి విజయ్ నటించిన గిల్లీ (32.50 కోట్లు) రికార్డుపై బాహుబలి కన్నేసింది. ఈ వీకెండ్‌లోగా ఈ రికార్డును ప్రభాస్ బద్ధలు కొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
బాహుబలి ది ఎపిక్ 2వ రోజు కలెక్షన్స్
రెండో రోజు బాహుబలి ది ఎపిక్‌కు తొలి రోజును మించి కలెక్షన్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సినిమాకు తెలుగు వెర్షన్‌లో 38 శాతం, హిందీలో 8 శాతం, తమిళంలో 30 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో ఈ సినిమా 2వ రోజు తెలుగులో 13 కోట్ల రూపాయలు, హిందీలో 5 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 22 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా రెండ్రోజుల్లోనే బాహుబలి ది ఎపిక్.. 50 కోట్ల క్లబ్‌లో చేరుకుని రీ రిలీజ్‌లలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











