Baahubali The Epic Day 3 Collections: బాహుబలి ది ఎపిక్ మూడో రోజు వసూళ్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ పోషించిన చిత్రం బాహుబలి. పదేళ్ల క్రితం రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా చారిత్రాత్మక విజయం సాధించింది. రెండు పార్ట్స్ కలిపి 2500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. రీ రిలీజ్‌ల యుగంలో బాహుబలిని కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే రెండు భాగాలను విడివిడిగా కాకుండా బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మూడో రోజున ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
బాహుబలి తారాగణం
బాహుబలి సిరీస్‌కు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజ్, అడవి శేష్, రోహిణి, కల్పలత, రోహిణి, తనికెళ్ల భరణి, ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించగా.. నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

బాహుబలి ది ఎపిక్ రెండు రోజుల వసూళ్లు
బాహుబలి ది ఎపిక్‌కు ఇండియా వైడ్ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 1.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 9.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.1 కోట్ల రూపాయలు చొప్పున ఈ చిత్రం రెండ్రోజుల్లో 17.9 కోట్ల రూపాయల నెట్... 21.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్‌కు 1.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 7.9 కోట్ల రూపాయలు, రెండో రోజున 4.75 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది బాహుబలి. రెండు రోజుల వరకు ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో బాహుబలి వసూళ్లు పరిశీలిస్తే... కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 13.8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 70 లక్షల రూపాయలు, మలయాళంలో 35 లక్షల రూపాయలు వసూలు చేసింది.
బాహుబలి ది ఎపిక్ ఓవర్సీస్ కలెక్షన్స్
బాహుబలి ది ఎపిక్‌కి నార్త్ అమెరికాలో తొలి రోజున 100K, రెండో రోజున 75K చొప్పున రెండ్రోజుల్లో 175K (భారత కరెన్సీలో 1.55 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ రాగా.. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో మరో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా రెండ్రోజుల్లో ఓవర్సీస్‌లో ప్రభాస్ మూవీకి 6.7 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి వరల్డ్ వైడ్‌గా బాహుబలి ది ఎపిక్‌కు 27.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఈ కలెక్షన్స్‌తో రీ రిలీజ్‌లలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో బాహుబలి ది ఎపిక్ 3వ స్థానంలో నిలిచింది. సనం తేరి కసమ్ (41.94 కోట్ల రూపాయలు) తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత తుంబాడ్ (38 కోట్ల రూపాయలు), గిల్లి 26.5 కోట్ల రూపాయలు, యే జవానీ హై దీవానీ 26 కోట్ల రూపాయలుతో నిలిచాయి. త్వరలోనే ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ను బాహుబలి అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బాహుబలి ది ఎపిక్ 3వ రోజు కలెక్షన్స్
రీ రిలీజ్ అయినప్పటికీ బాహుబలికి ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. రిలీజ్ అవుతున్న సినిమాలతో సమానంగా వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది బాహుబలి. మూడో రోజు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు బాహుబలి ది ఎపిక్‌కు తెలుగులో 40 శాతం, హిందీలో 12 శాతం, తమిళంలో 46 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో మూడో రోజున ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కోటి రూపాయలు, హిందీలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయలు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో బాహుబలి మూడు రోజులోనే 50 కోట్ల క్లబ్‌లో చేరి తన పేరిట మరో తిరుగులేని రికార్డును వేసుకోవడానికి అడుగుదూరంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











