Baahubali The Epic Day 5 Collections: బాహుబలి సంచలనం... రీ రిలీజ్‌లలో అత్యధిక వసూళ్లతో సరికొత్త రికార్డ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారతీయ చిత్ర పరిశ్రమలో దృశ్య కావ్యంగా, తెలుగు సినిమా గతిని, ఖ్యాతిని మార్చిన సినిమాగా బాహుబలి చిత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ పేరుతో రెండు భాగాలుగా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. రెండు భాగాలు కలిపి ఏకంగా 2500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి బాహుబలి చరిత్ర సృష్టించింది. ప్రస్తుత రీ రిలీజ్ యుగంలోనూ బాహబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం సంచలన వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి ది ఎపిక్ ఐదో రోజున ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు బాహుబలి సిరీస్‌ను నిర్మించారు. ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ పోషించగా రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజ్, అడవి శేష్, రోహిణి, కల్పలత, రోహిణి, తనికెళ్ల భరణి, ప్రభాకర్ తదితరులు నటించారు. బాహుబలి సిరీస్‌కు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించగా.. నోరా ఫతేహి ఐటెం సాంగ్‌ చేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

Baahubali The Epic Day 5 Expected Box Office Collections Worldwide Prabhas Movie Beats Sanam Teri Kasam

బాహుబలి ది ఎపిక్ నాలుగు రోజుల వసూళ్లు
బాహుబలి ది ఎపిక్‌కు ఇండియా వైడ్ పెయిడ్ ప్రీమియర్స్‌ ద్వారా 1.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 9.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.3 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.65 కోట్ల రూపాయలు చొప్పున ఈ చిత్రం నాలుగు రోజుల్లో 26.1 కోట్ల రూపాయల నెట్... 30.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

బాహుబలి ది ఎపిక్ ఓవర్సీస్ కలెక్షన్స్
బాహుబలి ది ఎపిక్‌కి నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 753K (భారత కరెన్సీలో 6.67 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో కెనడా నుంచి 22K (దాదాపుగా 20 లక్షల రూపాయలు) , అమెరికా నుంచి 731K (6.48 కోట్ల రూపాయలు) డాలర్లు చొప్పున వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో మరో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ప్రభాస్ మూవీకి 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి వరల్డ్ వైడ్‌గా బాహుబలి ది ఎపిక్‌‌కు 41.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్‌‌కు 1.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 7.9 కోట్ల రూపాయలు, రెండో రోజున 4.90 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.9 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.08 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది బాహుబలి. నాలుగు రోజుల వరకు ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో బాహుబలి వసూళ్లు పరిశీలిస్తే... కర్ణాటకలో 3.87 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 17.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.5 కోట్ల రూపాయలు, మలయాళంలో కోటి రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

బాహుబలి ది ఎపిక్ 5వ రోజు కలెక్షన్స్
ఆదివారం వరకు సాలీడ్ వసూళ్లను సాధించిన బాహుబలి ది ఎపిక్ .. వర్కింగ్ డేలు మొదలయ్యాక నిరాశపరుస్తోంది. సోమవారం ఇండియాలో కేవలం 1.65 కోట్లు మాత్రమే రాబట్టిన ప్రభాస్.. మంగళవారం బాగా నిరాశపరిచాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు బాహుబలి ది ఎపిక్‌కు తెలుగులో 14 శాతం, హిందీలో 12 శాతం, తమిళంలో 22 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో ఐదో రోజున బాహుబలి ది ఎపిక్‌ వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయలు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా.. బాహుబలి ది ఎపిక్ ఈ వారంలో 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఐదో రోజు నాటి కలెక్షన్స్‌తో రీ రిలీజ్‌లలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో టాప్‌లో ఉన్న సనం తేరి కసమ్ (41.94 కోట్ల రూపాయలు)ను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత తుంబాడ్ (38 కోట్ల రూపాయలు), గిల్లి 26.5 కోట్ల రూపాయలు, యే జవానీ హై దీవానీ 26 కోట్ల రూపాయలుతో నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X