Baahubali: The Epic Overseas Collections: ఓవర్సీస్‌లో బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ జోరు.. యూఎస్‌లో ఎన్ని కోట్లం
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.
ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ఒకే భాగం చేసి ది బాహుబలి: ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ మూవీకి సంబంధించి ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ను ఇటీవల ప్రారంభించారు. విడుదలకు 15 రోజుల ముందే ఈ సినిమా ప్రీ సేల్స్ ప్రారంభించగా భారీ స్పందన లభిస్తున్నది. ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..
బాహుబలి ది బిగినింగ్ సినిమా విషయానికి వస్తే.. ఓ మోస్తారు అంచనాలతో రిలీజైన ఈ చిత్రం భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 650 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 1810 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తంగా 2460 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.
అయితే ఈ సినిమా రెండు భాగాలు కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రూపొందించి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా, భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. అమెరికాలో 111 లోకేషన్లలో 112 షోల కోసం ప్రీ సేల్స్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 5500 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 102500 డాలర్లు అంటే.. సుమారుగా 89 లక్షల రూపాయలు భారతీయ కరెన్సీలో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అమెరికానే కాకుండా ఈ సినిమా ముందుస్తు టికెట్ బుకింగ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ప్రారంభమయ్యాయి.
ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాల్లో దళపతి విజయ్ నటించిన గిల్లీ సినిమా అత్యధికంగా 32.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత విజయ్ నటించిన సచిన్ చిత్రం 13.6 కోట్లు, ఖలేజా చిత్రం 11 కోట్లు, మురారీ చిత్రం 9 కోట్లు, గబ్బర్ సింగ్ 8 కోట్లు, ఖుషీ 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ రికార్డులను బాహుబలి ది ఎపిక్ అధిగమిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











