చైనాలో సల్మాన్ సునామీ.. భజరంగీ భాయ్‌జాన్‌కు భారీ కలెక్షన్లు

By Rajababu

Recommended Video

Bajrangi Bhaijaan Collections in China

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన భజరంగీ భాయ్‌జాన్ చైనాలో భారీ కలెక్షన్లను రాబడుతున్నది. తొలివారంతాంలో ఈ చిత్రం కోట్లు కొల్లగొట్టింది. అయితే చైనాలో అమీర్‌ఖాన్ ట్రాక్ రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. తో మూడు రోజుల్లో ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది.

 వారాంతంలో భారీగా

వారాంతంలో భారీగా

ప్రేమ, ఎమోషన్స్‌తో నిండిని సల్మాన్ ఖాన్ చిత్రం భజరంగీ భాయ్‌జాన్ చిత్రం చైనాలో మంచి వసూళ్లను రాబడతున్నది. అమీర్‌ఖాన్ రికార్డులకు ధీటుగా ఈ చిత్రం కలెక్షన్లను వసూలు చేస్తున్నది. ఈ చిత్రం తొలి వారాంతంలో 55.22 కోట్లు కలెక్ట్ చేసింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

మూడు రోజుల కలెక్షన్లు ఇలా

మూడు రోజుల కలెక్షన్లు ఇలా

లిటిల్ లోలితా మంకీ గాడ్ అనే పేరుతో భజరంగీ భాయ్‌జాన్ చిత్రం మార్చి 2 తేదీన విడుదలైంది. శుక్రవారం 2.25 మిలియన్ డాలర్లు, శనివారం 3.11 మిలియన్ డాలర్లు, ఆదివారం 3.13 మిలియన్ డాలర్లు. మొత్తంగా 8.49 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

19 వేల షోలు ప్రదర్శన

19 వేల షోలు ప్రదర్శన

చైనాలో సల్మాన్‌కు ఈ విధంగా మంచి కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సంబంధించి 19 వేల షోలు ప్రదర్శించారు. అయితే తొలివారాంతంలో అమీర్ ఖాన్ చిత్రాన్ని 62 వేల షోలు ప్రదర్శించగా 78 కోట్లకుపైగా వసూలు చేసింది.

 చైనాలో అమీర్‌ఖాన్‌దే హవా

చైనాలో అమీర్‌ఖాన్‌దే హవా

చైనాలో బాలీవుడ్ చిత్రాల రీలీజ్ వల్ల ఎక్కువగా లాభపడింది అమీర్‌ఖాన్ మాత్రమే. అమీర్ నటించిన దంగల్ చిత్రం కనకవర్షం కురిపించింది. ఇటీవల రిలీజైన సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

8 వేల స్క్రీన్లలో రిలీజ్

8 వేల స్క్రీన్లలో రిలీజ్

భజరంగీ భాయ్‌జాన్ చిత్రం రికార్డు స్థాయిలో 8 వేల స్క్రీన్లలో రిలీజైంది. సల్మాన్ చిత్రంలో ఇంత పెద్ద మొత్తంలో విడుదల కావడం ఇదే మొదటిసారి. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X