»   » ఆ విషయంలో యంగ్ హీరోలతో బాలయ్య పోటీ

ఆ విషయంలో యంగ్ హీరోలతో బాలయ్య పోటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎప్పటికప్పుడు సూపర్ హిట్స్ తో కెరిర్ ని దిగ్విజయంగా ముందుకు తీసుకు వెళ్తూ తన తోటి హీరోల నుంచి దూరం జరిగి, యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు బాలయ్య. ముఖ్యంగా బాలయ్య చిత్రాలకు జరిగే బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలకు దగ్గరగా ఉంటుంది. ఆయనతోటి హీరోలకు 30 కోట్లకు బిజినెస్ కావటం కష్టంగా ఉంటే బాలకృష్ణ ఈజీగా నలభై దాకా వచ్చేస్తున్నారు. తాజాగా ఆయన చిత్రం డిక్టేటర్ బిజినెస్ దాన్ని ప్రూవ్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా 40 కోట్ల మేర బిజినేస్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు హీరోలతో పోటి పడుతున్న బాలకృష్ణ తన బిజినెస్ 50 కోట్ల క్లబ్ లో చేరాలని ఆరాట పడుతున్నాడు. తన తోటి హీరోలు కేవలం 30-35 కోట్ల బిజినేస్ దగ్గరే ఆగిపోయారు.


బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోహీరోయిన్లుగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. ఈ చిత్రం టాకీపార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది.


Balakrishna's Dictator Business

దర్శకుడు మాట్లాడుతూ, 'బాలయ్య 99వ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలుసు. వారి అంచనాలకు తగ్గట్టుగా ఉండే చిత్రమిది. ఆయన అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటున్నారో, దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. డిఫరెంట్‌గా ఉంటూనే ఇప్పటి వరకు చూడని స్టయిలీష్‌ యాంగిల్‌లో బాలకృష్ణ అలరించనున్నారు.


నిర్మాత మాట్లాడుతూ... , 'ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహి స్తున్నాం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.


నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Nandamuri Balakrishna’s Dictator movie is expected to be sold to the tune of Rs 40 Cr .
Please Wait while comments are loading...