twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణంగా రూలర్ కలెక్షన్లు.. లాభం కోసం ఎంత వసూలు చేయాలంటే

    |

    నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం భారీ అంచనాలతో రిలీజై ప్రేక్షకులను నిరాశపరిచిందనే టాక్ ముందుకెళ్తున్నది. క్రిస్మస్ హాలీడేస్‌లో కూడా ఈ సినిమా గొప్పగా వసూళ్లు రాబట్టకపోవడంపై డిస్టిబ్యూటర్లు ఆందోళనలో పడినట్టు తెలుస్తున్నది. గత ఐదు రోజుల్లో రూలర్ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయని ట్రేడ్ వర్గాల రిపోర్టు...

     5 రోజుల్లో ఏపీ, తెలంగాణలో

    5 రోజుల్లో ఏపీ, తెలంగాణలో

    రూలర్ చిత్రం తొలి రోజున ఆశాజనకంగానే వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ప్రేక్షకులు, సినీ విమర్శకులను మెప్పించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు క్షీణించడం మొదలయ్యాయి. 5వ రోజున ఏపీ, తెలంగాణలో రూ.30 లక్షల వసూళ్లు సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.34 లక్షల షేర్ సాధించడం గమనార్హం.

    ఐదో రోజు కలెక్షన్లు

    ఐదో రోజు కలెక్షన్లు

    రూలర్ చిత్రం ఐదవ రోజున నైజాంలో రూ.10.5 లక్షలు, సీడెడ్‌లో రూ.10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.2.4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.6 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.4 లక్షలు, గుంటూరులో రూ.2 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.1.4 లక్షలు, నెల్లూరులో రూ.1.2 లక్షలతో మొత్తంగా రూ.30 లక్షలు వసూలు చేసింది.

    ఐదు రోజుల మొత్తం కలెక్షన్లు

    ఐదు రోజుల మొత్తం కలెక్షన్లు

    గత ఐదు రోజుల్లో రూలర్ చిత్రం ఏపీ, తెలంగాణలో మొత్తం రూ.6.81 కోట్ల వసూళ్లు సాధించింది. నైజాంలో రూ.1.51 కోట్లు, సీడెడ్‌లో రూ.1.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.53 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.38 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.43 లక్షలు, గుంటూరులో రూ.1.46 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.36 లక్షలు, నెల్లూరులో రూ.33 లక్షల కలెక్షన్లు నమోదు చేసింది.

    ఓవర్సీస్‌లో రూలర్ వసూళ్లు

    ఓవర్సీస్‌లో రూలర్ వసూళ్లు

    ఇక ఓవర్సీస్‌, ఇతర రాష్ట్రాలలో కూడా రూలర్ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో మొత్తంగా గత ఐదు రోజుల్లో రూ.1.07 కోట్లు సంపాదించింది. ఓవర్సీస్‌లో రూ.52 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.8.4 కోట్లు షేర్, రూ.14.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    రూలర్ ప్రీ రిలీజ్ బిజినెస్

    రూలర్ ప్రీ రిలీజ్ బిజినెస్

    రూలర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను రూ.5.3 కోట్లకు, సీడెడ్ రూ.5.2 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.2.5 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.1.55 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.1.4 కోట్లు, గుంటూరులో రూ.2.7 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.1.1 కోట్ల మేర బిజినెస్ చేసింది.

    లాభాల్లోకి రావాలంటే

    లాభాల్లోకి రావాలంటే

    ఏపీ తెలంగాణలో మొత్తంగా రూ21.25 కోట్లు మేర, కర్టాటక, మిగితా రాష్ట్రాల్లో రూ.2.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 లక్షలతో కలిపి మొత్తంగా 23.75 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.24.5 కోట్ల షేర్ రాబట్టాల్సింది. ఇంకా 16 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

    English summary
    Ruler box office collections: Balakrishna's Ruler movie released on December 20th. It collects 15 crores gross collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X