»   » ‘టెంపర్' : బండ్ల గణేష్ ట్రిక్ వర్కవుట్ అయ్యింది

‘టెంపర్' : బండ్ల గణేష్ ట్రిక్ వర్కవుట్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ఆడియో పంక్షన్ లో ఈ చిత్రం అవుట్ పుట్ టెర్రిఫిక్ గా వచ్చిందని...తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నామని బంగ్ల గణేష్ ప్రకటించారు. దానికి తోడు దర్సకుడు పూరి జగన్నాథ్ సైతం కొన్ని ఏరియాలు రైట్స్ తీసుకుంటున్నట్లు వార్త వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దాంతో డిస్ట్రిబ్యూటర్స్ లలో ఉత్సాహం, ఆసక్తి పెరిగింది. ఇంత బాగా వచ్చిన చిత్రం తాము ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా ట్రేడ్ లో హడావిడి మొదలై బండ్ల గణేష్ చేత మొత్తం ఈ చిత్రం ఏరియాలు ఫ్యాన్సీ రేటుకు వెళ్లిపోయేలా చేసింది. ఇది చూసిన మిగతా నిర్మాతలు ...మొదట తానే ఉంచుకుంటాను..అమ్మనని చెప్పిన బండ్ల గణేష్ మాటలు ని ఓ ట్రిక్ గా చెప్పుకుంటన్నారు. ఆ ట్రిక్ బాగా పనిచేసి డిస్ట్రిబ్యూటర్స్ ని ఎట్రాక్ట్ చేసిందంటున్నారు. మీరే చూడండి...ఏ ఏరియాకు...ఏయే పంపిణీ దారులో...


Bandla Ganesh's trick to lure Distributors!

టెంపర్ డిస్ట్రిబ్యూటర్స్:


నైజాం - సురేష్


సీడెడ్ - లక్ష్మీ కాంత్ రెడ్డి


ఉత్తరాంధ్ర - భారత్ పిక్చర్స్


తూర్పు గోదావరి - పూరి జగన్నాథ్...త్రూ సురేష్


నెల్లూరు - ఐకాన్ మూవీస్


కృష్ణా - అలంకార్ ప్రసాద్


గుంటూరు - ఎస్.క్రియేషన్స్


ఓవర్ సీస్ - గ్రేట్ ఇండియా ఫిల్మ్స్


కర్ణాటక -బృందా అశోసియేట్స్


తమిళనాడు - ఎస్ పి ఐ సినిమాస్


రెస్ట్ ఆఫ్ ఇండియా- ఇంద్ర ఫిల్మ్స్


ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.


ఇక చిత్రం విశేషాలకు వస్తే...


Bandla Ganesh's trick to lure Distributors!

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది ఉంది. ‘టెంపర్' చిత్రం చివరి షెడ్యూల్‌కు నిర్మాత బండ్ల గణేష్ డబ్బులు ఇవ్వలేదని, పూరి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడని, అందుకే నిర్మాత ఇలా సెటిల్మెంట్ చేసాడని కొందరు అంటున్నారు. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది.


ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

English summary
To everyone's surprise, 'Temper' distribution rights for all the territories have been sold out to outsiders. Except for West Godavari which will be released by Puri himself, All the areas have been bought by distributors for fancy prices.
Please Wait while comments are loading...