twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Beast closing collections ప్రపంచవ్యాప్తంగా ఎంత నష్టమంటే? విజయ్ కెరీర్‌లో తొలిసారి ఊహించని దెబ్బ

    |

    దక్షిణాది సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో బీస్ట్ ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సూపర్ స్టార్ విజయ్, అందాల భామ పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఎవరూ ఊహించిన విధంగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు దిగువగా ఉండటం ట్రేడ్ వర్గాలను కూడా నిరాశకు గురిచేసింది. బీస్ట్ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    బీస్ట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. తమిళనాడు థియేట్రికల్ హక్కులు 66 కోట్లుకు, ఏపీ, నైజాం హక్కులు 10 కోట్లు, కర్ణాటక హక్కులు 8 కోట్లు, కేరళ థియేట్రికల్ హక్కులు 7.5 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 31 కోట్లుగా నమోదు అయ్యాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది.

    నైజాంలో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్లు

    నైజాంలో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్లు

    బీస్ట్ సినిమా నైజాంలో తొలి రోజున భారీగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో రెండోరోజు సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈ సినిమాను తొలి రోజే థియేటర్ల నుంచి తొలగించిన దాఖలాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా లైఫ్ టైమ్ రన్‌గా రూ.2.80 కోట్ల షేర్ సాధించింది. దాదాపు 2 కోట్లుపైగా నష్టంతో ముగిసింది.

    ఆంధ్రాలో ఎంత నష్టమంటే?

    ఆంధ్రాలో ఎంత నష్టమంటే?

    ఇక ఏపీలో కూడా బీస్ట్ సినిమాకు ఇదే పరిస్థితి కనిపించింది. సీడెడ్‌లో 1.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 83 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 52 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 41 లక్షలు, గుంటూరు జిల్లాలో 60 లక్షలు, కృష్ణా జిల్లాలో 62 లక్షలు, నెల్లూరు జిల్లాలో 40 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో 7.33 కోట్ల షేర్, 13.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో సుమారు 2.7 కోట్ల నష్టంతో ముగిసింది.

     తమిళనాడులో బీస్ట్ వసూళ్ల హవా

    తమిళనాడులో బీస్ట్ వసూళ్ల హవా

    ఇక తమిళనాడులో బీస్ట్ సినిమా వసూళ్లు పర్వాలేదనిపించాయి. అయితే కేజీఎఫ్2 ప్రభంజనానికి ఈ సినిమా తలవొగ్గడంతో బీస్ట్ కలెక్షన్లు లాభాల్ని సాధించలేకపోయింది. క్లోజింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం గమనార్హం. తమిళనాడులో 66.10 కోట్ల మేర షేర్ సాధించింది.

     కేరళ, ఓవర్సీస్‌‌లో కలెక్షన్ల ఎంతంటే?

    కేరళ, ఓవర్సీస్‌‌లో కలెక్షన్ల ఎంతంటే?

    అలాగే బీస్ట్ సినిమా కేరళలో కూడా భారీగా నష్టాల్ని చవి చూసినట్టు సమాచారం. ఈ సినిమా కేరళలో 5 కోట్లు సాధించింది. దాంతో దదాపు 2.5 కోట్ల నష్టం ఏర్పడిందనే ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఇతర రాష్ట్రాల్లో 1.13 కోట్లు, ఓవర్సీస్‌లో 33.05 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 120 కోట్ల షేర్, 235 కోట్ల గ్రాస్ సాధించింది.

    ప్రపంచవ్యాప్తంగా ఎంత నష్టమంటే?

    ప్రపంచవ్యాప్తంగా ఎంత నష్టమంటే?

    బీస్ట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తర్వాత 127 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లుపైగా నష్టంతో ముగిసింది. విజయ్ సినిమా ఇటీవల కాలంలో నష్టాల్లో ముగియడం ఇదే మొదటిసారి. రిలీజ్‌కు ముందు సంపాదించుకొన్న క్రేజ్‌ను కలెక్షన్లుగా మార్చుకోలేకపోయింది.

    English summary
    Vijay and Pooja Hegde's Beast movie completes Its box office run. It closes at 120 crores share and 235 crores gross worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X