»   » అయ్యో..అంతలాసా..అయితే కష్టమే

అయ్యో..అంతలాసా..అయితే కష్టమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లుడు శీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆ సినిమా సక్సెస్ అయినా కొంతకాలం సైలెంట్ గా ఉండి సీనియర్ దర్సకుడు తో సినిమా మొదలెట్టి స్పీడున్నోడు అంటూ మొన్న శుక్రవారం ధియోటర్స్ లో దిగాడు.

భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం మార్నింగ్ షో కే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఈ సంవత్సరంలో పెద్ద డిజాస్టర్ చిత్రంగా నమోదైంది. అందుతున్న సమాచారం ప్రకారం..ప్రీ రిలీజ్ ఇరవై కోట్లు వరకూ జరిగింది. ఇప్పుడు అందులో సగం కూడా రావటం కష్టమే అంటున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా లాస్ అవుతారని చెప్తున్నారు.

Bellamkonda's Speedunnodu survives with heavy losses

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ....‘అల్లుడుశీను' హీరోగా మంచి లాంచ్‌గా భావిస్తున్నాను. ఆ సినిమాతో అన్ని రకాలుగా మంచి మార్కులే పడ్డాయి. ‘స్పీడున్నోడు' నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రం. తమిళ, కన్నడ భాషల్లో హిట్టైన ‘సుందర్‌ పాండియన్'కు రీమేకిది. చివరి అరగంట మినహా మిగిలిన కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పు చేశాం.

‘స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో ముడిపడిన ఓ యువకుడికి ఓ సమస్య ఎదురైతే దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది చిత్ర కథ. చూసి మరచిపోయే సినిమా కాదిది. ఇంటికెళ్లినా గుర్తొస్తూనే ఉంటుంది. కథకు తగ్గట్టు దర్శకుడే టైటిల్‌ ఎంపిక చేశారు.

ఈ సినిమా కోసం ‘అల్లుడుశీను' కన్నా పది రెట్లు కష్టపడ్డా. నటుడిగా నిరూపించుకోవడానికి నాకు దొరికిన మంచి అవకాశమిది. ప్రతి సినిమాకు కొత్తగా కనిపించాలనుకుంటున్నా. ఇందులో కాస్త డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తా'' అని చెప్పారు. అయితే అవేమీ భాక్సాఫీస్ వద్ద మార్కులు వేయించుకోవటానికి పనికి రావటం లేదు.

English summary
‘Speedunnodu’ which released last Friday is heading towards a big disaster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu