»   » 100 కోట్ల క్లబ్‌లో ‘భాగ్ మిల్ఖా భాగ్’

100 కోట్ల క్లబ్‌లో ‘భాగ్ మిల్ఖా భాగ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన 'భాగ్ మిల్ఖా భాగ్' చిత్రం ఇటీవలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పటి ఇండియన్ స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రం తాజాగా 4 వారాలు పూర్తి చేసుకుని రూ. 100 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది.

2013లో విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో ఇప్పటి వరకు రేస్-2, యే జవానీ హై దివానీ చిత్రాలు మాత్రమే 100 కోట్ల వసలూ చేసాయి. తాజాగా 'భాగ్ మిల్ఖా భాగ్' ఆ ఘన సొంతం చేసుకుంది. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈచిత్రం ఓపెనింగ్స్ పెద్దగా సాధించ లేదు. కేవలం 40 నుండి 45 శాతం ఆక్కుపెన్సీ మాత్రమే సాధించింది.

అయితే వీకెండ్ తర్వాత సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ఆక్యుపెన్సీ శాతం పెరిగింది. తొలి వారం ఈ చిత్రం రూ. 53.49 కోట్లు సాధించగా, రెండో వారంలో రూ. 26.1 కోట్లు, మూడో వారంలో 17. 31 కోట్లు సాధించింది. మూడో వారంలోనే ఈ సినిమా 100 కోట్ల మార్కు దాటుతుందని అనుకున్నప్పటికీ అందుకు రూ. 3.1 తక్కువయ్యాయి. నాలుగో వారాంతంలో రూ. 8 కోట్లు యాడ్ కావడంతో 24రోజుల్లోనే ఈ సినిమా 105.40 కోట్లు వసూలు చేసింది.

'ఫ్లయింగ్ సిక్కు'గా ప్రపంచానికి సుపరిచితుడైన ఇండియన్ స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని 'భాగ్ మిల్ఖా భాగ్' చిత్రం తెరకెక్కింది. ఫర్హాన్ అక్తర్ మిల్ఖా సింగ్ పాత్రను పోషించారు. ఢిల్లీ-6 దర్శకుడు రాకేష్ ఓం ప్రకాస్ మెహ్రా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో మిల్ఖా సింగ్ అనే బాలుడి కుటుంబ ఊచకోతకు గురవుతుంది. బ్రతికి బయట పడ్డ మిల్ఖా సింగ్ ఢిల్లీ చేరుకుంటాడు. దుర్భర పరిస్థితులు, నేరాలు చేస్తూ పెరిగిన ఆ బాలుడు ఆ తర్వాత సైన్యంలో చేరి జవాన్‌గా ఎలా మారాడు, దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా మారడానికి దారి తీసిన సంఘటనలను సినిమాలో చూపించారు.

English summary
Bhaag Milkha Bhaag (BMB) is unstoppable at the Indian Box Office. Despite two new movies releasing this weekend, the Farhan Akhtar starrer has remained the first choice of moviegoers for fourth consecutive week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu