Bhadrakaali Day 1 Box Office: భద్రకాళికి షాకింగ్ కలెక్షన్స్ .. విజయ్ ఆంటోనీ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా వినూత్నమైన కథలతో ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మార్గన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనీ తాజాగా నటించిన చిత్రం శక్తి తిరుమగన్.. తెలుగులో భద్రకాళి పేరుతో విడుదలైంది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన భద్రకాళి సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో భద్రకాళి మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.

భద్రకాళి బడ్జెట్ ఎంత?
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ భద్రకాళి సినిమాను నిర్మించగా.. మీరా విజయ్ ఆంటోనీ సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో కన్నన్, వాగై చంద్రశేఖర్, సెల్ మురుగన్, తిరుపతి రవీంద్ర, క్రిష్ హాసన్, కిరణ్ రాథోడ్, శోభా విశ్వనాథ్, ప్రశాంత్ పార్థిబన్ తదితరులు నటించారు. షెల్లే ఆర్ కాలిస్ట్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీత దర్శకుడిగా పనిచేశారు. రేమాండ్ డెర్రిక్ క్రాస్టా దిన్సా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి భద్రకాళి మూవీకి సుమారు 20 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Bhadrakaali Day 1 Expected Box Office Collections Worldwide Vijay Antony s movie good start at GBOC

భద్రకాళి బిజినెస్
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు ఈ చిత్రంలోని పాటలు జనంలోకి బాగా వెళ్లాయి. విజయ్ ఆంటోనీ క్రేజ్‌తో భద్రకాళి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లలో మంచి బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే భద్రకాళికి థియేట్రికల్ బిజినెస్ ఎంత చేసింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

భద్రకాళి తొలి రోజు కలెక్షన్స్ ఎంత?
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌‌తో భద్రకాళి సినిమాకు మంచి బుకింగ్స్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు సాయంత్రం 6 గంటల వరకు తమిళ వెర్షన్‌లో 12 శాతం, తెలుగు వెర్షన్‌లో 15 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు చెన్నైలో 288 షోలు, బెంగళూరులో 144 షోలు, విశాఖలో 36 షోలు ప్రదర్శితమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలిరోజు విజయ్ ఆంటోనీ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే.. విజయ్ ఆంటోనీ గత చిత్రం మార్గాన్ యావరేజ్‌గా నిలిచింది. లియో జాన్ పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సముద్రఖని, మహానంది శంకర్, వినోద్ సాగర్, రామచంద్రన్ ధనరాజ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఇండియాలో 12.36 కోట్ల రూపాయల నెట్.. 14.41 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని సాక్ నిక్ తెలిపింది. మరి భద్రకాళి చిత్రంతోనైనా విజయ్ ఆంటోనీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X