twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసును శాసిస్తున్న సీఎం భరత్..... 2 రోజుల కలెక్షన్ రిపోర్ట్!

    By Bojja Kumar
    |

    ముఖ్యమంత్రి భరత్ పాత్రలో మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. విడుదల ముందు నుండే ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. మహేష్ బాబు అంటే ఉన్న క్రేజ్, కొరటాల శివ దర్శకత్వం, దాదాపు 2 వేల థియేటర్లలో సినిమా విడుదల కావడం ఒక ఎత్తయితే.... విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంతో పాటు సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ నమోదయ్యాయి.

    తొలి రోజు రూ. 55 కోట్ల గ్రాస్

    తొలి రోజు రూ. 55 కోట్ల గ్రాస్

    తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్లకుపైగా గ్రాస్ నమోదైంది. సినిమా విడుదల ముందు నుండే భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడం బాగా కలిసొచ్చింది. తొలి రోజు రూ. 35 కోట్ల మేర డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

    మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

    మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

    మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘భరత్ అనే నేను' చిత్రం నిలిచింది. మహేష్ గత చిత్రాలు స్పైడర్, శ్రీమంతుడు సాధించిన ఓపెనింగ్స్ రికార్డులను ఈ చిత్రం చెరిపేసింది. దీంతో పాటు ఖైదీ నెం.150, రంగస్థలం, జై లవ కుశ రికార్డులను కూడా బీట్ చేసింది. అయితే అజ్ఞాతవాసి రికార్డును అధిగమించలేక పోయింది. బాహుబలి 2, బాహుబలి, అజ్ఞాతవాసి తర్వాతి స్థానంలో ‘భరత్ అనే నేను' చిత్రం నిలిచింది.

    రెండోరోజు వసూళ్లు రూ. 45 కోట్లు

    రెండోరోజు వసూళ్లు రూ. 45 కోట్లు

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘భరత్ అనే నేను' మూవీ రెండో రోజు వసూళ్లు రూ. 45 కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల కలెక్షన్ రూ. 100 కోట్లు(గ్రాస్) టచ్ అయింది.

    రూ. 100 కోట్ల షేర్ వసూలవ్వాలి...

    రూ. 100 కోట్ల షేర్ వసూలవ్వాలి...

    ‘భరత్ అనే నేను' మూవీ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ రూ. 100 కోట్లకు అమ్ముడయ్యాయి. రెండు రోజుల్లో వచ్చిన మొత్తం గ్రాస్‌లో రూ. 55కోట్ల మేర డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. షేర్ వ్యాల్యూ రూ. 100 కోట్లు దాటితే ఈ చిత్రం లాభాల బాటలోకి వెళ్లనుంది.

    ఓవర్సీస్ మార్కెట్లో రూ. 2.5 మిలియన్ డాలర్

    ఓవర్సీస్ మార్కెట్లో ‘భరత్ అనే నేను' ప్రీమియర్ షోలతో కలిపి తొలి రోజు $2.5 మిలియన్(రూ. 16.25 కోట్లు) పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్ చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ఒక్క నార్త్ అమెరికాలోనే $1.55 మిలియన్ డాలర్ (రూ. 10.15 కోట్లు) రాబట్టింది.

    English summary
    Mahesh Babu's latesh film Bharat Ane Nenu collected Rs 83 crore in first 2 days. The movie collected Rs 55.50 crore gross on the first day, Rs 28 crore on Secon day.Mahesh Babu's latesh film Bharat Ane Nenu collected Rs 83 crore in first 2 days. The movie collected Rs 55.50 crore gross on the first day, Rs 28 crore on Secon day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X