ఓవర్సీస్ బాక్సాఫీస్‌పై ప్రిన్స్ మహేష్ పంజా.. అమెరికాలో ‘భరత్’ సరికొత్త రికార్డు!
ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం కలెక్షన్ల పంట పండిస్తున్నది. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ రూ.150 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తిరగరాస్తున్నది. అమెరికాలో భరత్ అనే నేను సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Recommended Video


యూఎస్‌లో రూ.17 కోట్లు
అమెరికాలో ప్రిన్స్ మహేష్ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. గత వారం రోజులో భరత్ అనే నేను రూ.17 కోట్లు ( 2.6 మిలియన్లు) వసూలు చేసింది. ఈ చిత్రం నాన్ బాహుబలి చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది.

రూ.20 కోట్ల క్లబ్‌పై కన్ను
సీఎం భరత్ అనే పాత్రలో నటించిన ప్రిన్స్ మహేష్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ కలెక్షన్ల రికార్డులను సాధిస్తున్నాడు. ఆయన నటించిన భరత్ అనే నేను చిత్రం రూ.20 కోట్ల క్లబ్‌పై కన్నేసింది. ఒకవేళ ఈ మైలురాయిని అధిగమిస్తే బాహుబలి సిరీస్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా మహేష్‌బాబు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొంటాడు.

ఆస్ట్రేలియాలో దుమ్మురేపుతున్న ప్రిన్స్
భరత్ అనే నేను ఒక్క అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. ఈ చిత్రం రూ.2.6 కోట్ల (400000 ఆస్ట్రేలియా డాలర్లు) కలెక్షన్లను సాధించింది. ఆస్ట్రేలియా లాంటి చిన్న మార్కెట్‌లో కూడా ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించడం సినీ వర్గాలను షాక్ గురి చేస్తున్నది.

ప్రిన్స్ మహేష్‌కు భారీ ఊరట
భరత్ అనే నేను చిత్రం మహేష్‌బాబు మంచి రిలీఫ్‌ను ఇచ్చింది. గతేడాది వరుస ఫ్లాప్‌లతో సతమతమైన ప్రిన్స్ మహేష్‌కు భరత్ అనే నేను రూపంలో మంచి సక్సెస్ లభించింది. భరత్ అనే నేను చిత్రం 2018లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా మహేష్‌కు కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











