twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భరత్ అనే నేను’... ఇంకా ఎంత వసూలు చేస్తే బయ్యర్లు సేఫ్?

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో వెంట వెంటనే భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదవుతున్నాయి. మార్చి 30న విడుదలైన రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీ రూ. 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించగా, ఈ సినిమాకు 20 రోజుల గ్యాపుతో విడుదలైన మహేష్ బాబు పొలిటికల్ ఎంటర్టెనర్ 'భరత్ అనే నేను' కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 190 కోట్లకుపైగా గ్రాస్ వచ్చిందని, ఫుల్ రన్‌లో రూ. 200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చసాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంటే కొన్ని ఏరియాల్లో బయ్యర్లు లాభాలు చూడలేదని టాక్.

    Recommended Video

    Bharath Ane Nenu Overseas Collections
    ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వసూలైంది?

    ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వసూలైంది?

    ‘భరత్ అనే నేను' చిత్రం ఇప్పటి వరుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 192 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందన ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?

    ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘భరత్ అనే నేను' మూవీ ఇప్పటి వరకు దాదాపు రూ. 100 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే చాలా ఏరియాల్లో ఇంకా బయ్యర్లు లాభాల బాటలోకి రాలేదని టాక్.

     నైజాంలో ఇంకా ఎంత రావాలి?

    నైజాంలో ఇంకా ఎంత రావాలి?

    నైజాం డిస్ట్రిబ్యూటర్ ‘భరత్ అనే నేను' చిత్రాన్ని రూ. 22 కోట్లకు కొన్నాడని, 13 రోజుల్లో రూ. 17.3 కోట్ల వసూలైందని టాక్. లాభాలు రావాలంటే ఇంకా దాదాపు 5 కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది.

    సీడెడ్ ఏరియాలో...

    సీడెడ్ ఏరియాలో...

    సీడెడ్ ఏరియాలో రూ. 12 కోట్లకు రైట్స్ అమ్మారు. ఇక్కడ పదమూడు రోజుల్లో రూ. 9.2 కోట్లు రాబట్టింది. లాభాలు రావాలంటే ఇంకా మూడు కోట్ల రాబట్టాలి.

     నెల్లూరు ఏరియాలో...

    నెల్లూరు ఏరియాలో...

    నెల్లూరు ఏరియాలో భరత్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్మారు. పదమూడు రోజుల్లో రూ. 2.4 కోట్ల వసూలైనట్లు తెలుస్తోంది.

     వైజాగ్ ఏరియాలో..

    వైజాగ్ ఏరియాలో..

    వైజాగ్ ఏరియాలో ఈ చిత్రం దాదాపు లాభాల్లోకి వచ్చింది. ఈ చిత్రం రైట్స్ రూ. 8.2 కోట్లకు అమ్ముడవ్వగా ఇప్పటికే రూ. 8 కోట్ల షేర్ వసూలు చేసిందట.

     ఈస్ట్ గోదావరిలో...

    ఈస్ట్ గోదావరిలో...

    ఈస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రం రైట్స్ రూ. 6.7 కోట్లకు అమ్మారు. పదమూడు రోజుల్లో రూ. 6.35 కోట్లు రాబట్టింది. ఇక్కడ లాభాలు అనేవి దాదాపు ఖాయం అయిపోయాయి.

    వెస్ట్ గోదావరిలో...

    వెస్ట్ గోదావరిలో...

    వెస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రాన్ని రూ. 3.9 కోట్లకు అమ్మగా.... పదమూడు రోజుల్లో కేవలం 2 కోట్ల షేర్ మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది.

     లాభాల్లో కృష్ణ, గుంటూరు, తమిళనాడు, కర్నాటక

    లాభాల్లో కృష్ణ, గుంటూరు, తమిళనాడు, కర్నాటక

    భరత్ అనే నేను చిత్రం కృష్ణ, గుంటూరు, తమిళనాడు, కర్నాటక ఏరియాల్లో మంచి లాభాలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    English summary
    The Mahesh Babu film Bharat Ane Nenu has left the audience across the world mighty impressed.Tollywood Industry sources say that if the film continues its performance at the ticket counters, it will soon reach the 200 crore mark in another one week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X