twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుడిగాడు’ బడ్జెట్ ఎంత?... లాభం ఎంత?

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇప్పుడు మార్కెట్లో లాభాలతో దూసుకుపోతున్న చిత్రం ఏదంటే సుడిగాడు అని చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్లు కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా నైజాంలో రెండు కోట్ల యాభై లక్షలు రూపాయలు కలెక్టు చేసిందని చెప్తున్నారు. ఇదే రన్ కంటిన్యూ అయితే ఫస్ట్ వీక్ లోనే పది కోట్లు వరకూ కలెక్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా మీద ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు అందరిలో కలిగే ప్రశ్న. దీనికి దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు సమాధాన మిస్తూ... ఎనిమిదిన్నర కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు.

    ఆయన మాట్లాడుతూ... "బడ్జెట్ విషయంలో నేను నా నిర్మాత చంద్రశేఖర్ కు ధాంక్స్ చెప్పుకోవాలి.. కేవలం స్క్రిప్టుని నమ్మి అంత పెట్టుబడి పెట్టారు. నిజానికి అల్లరి నరేష్ సినిమాల మీద ఇది ఎక్కువ పెట్టుబడే. బిజినెస్ పరంగా ఆడియో పంక్షన్ జరిగేదాక మేం చెప్పే రేట్లకు ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. ట్ర్రైలర్స్, పోస్టర్స్ విడుదల అయ్యాక ఐదు గురు బయ్యర్లు తమకంటే తమకు కావాలని ఈ సినిమా రైట్స్ కోసం ఫైట్ చేసారు. వాళ్ళందరూ ఈ రోజున పెట్టుబడికి తగిన లాభాలను పొందుతున్నారని చెప్పగలను" అన్నారు.

    "ఇక మొదట్లో ఈ సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ట్రైలర్స్ విడుదల అయ్యాక ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. ఆడియన్స్ కమర్షియల్ సినిమాల్లో వచ్చే వాటికి విసిగిపోయారు. వాటినే బ్యాంకింగ్ గా పెట్టుకుని మేం సినిమా చేసాం. అవన్నీ సినిమాలో వర్కవుట్ అయ్యాయి. మేం స్పూఫ్ చేసిన హీరోలంతా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్,రాజమౌళి,శ్రీను వైట్ల ఈ సెటైర్స్ కు చాలా ఎప్రిసియేట్ చేసారు. మేము ఈ సినిమాలో అన్ని రకలా మీడియాలపైనా సెటైర్స్,స్పూఫ్ లు చేసాం. టీవి కమర్షియల్స్ దగ్గరనుంచి, ఎంతకీ కానీ టీవి సీరియల్స్ వరకూ ఈ సినిమాలో సెటైర్ చేసాం" అన్నారు.

    'సుడిగాడు'కి ట్యాగ్ లైన్.. 'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఆ క్రేజ్ తో ఓవర్ సీస్ బిజినెస్ లో అల్లరి నరేష్ కెరీర్ లో ఇంతవరకూ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. నలభై ఐదు లక్షలకు ఈ చిత్రాన్ని అమ్మినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్,వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌.

    English summary
    Sudigaadu film’s budget is 8 and half crores if you include prints and publicity. I am sure that the film will make double the profits Says Bheemineni Srinivasa Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X