twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫలించని పవన్ ఫాన్స్ 100 కోట్ల ఆశ.. చల్లారిపోయిన 'భీమ్లా నాయక్'.. ఇక లేనట్టే?

    |

    తెలుగు సినీ హీరోలు అందరికీ 100 కోట్ల మార్క్ సినిమా అనేది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో 100 కోట్ల మార్క్ ను అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి కానీ ఫ్యాన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయల మార్కును సినిమా ఒక్కటి కూడా చేయలేదు.

    ఆయన తాజాగా హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా వంద కోట్ల రూపాయల మార్కును దాటుతుందని అభిమానుల ఆశలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆశలు కూడా వమ్మయ్యేటట్టు కనిపిస్తున్నాయి.. అసలేం జరిగింది ఎందుకు 100 కోట్ల రూపాయల మార్కును అందుకోవడం కష్టం అనే వివరాల్లోకి వెళితే.

    స్క్రీన్ ప్లే-మాటలు కూడా

    స్క్రీన్ ప్లే-మాటలు కూడా

    పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్ ప్లే-మాటలు కూడా అందించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మురళీ శర్మ, సముద్రఖని, రావు రమేష్, రఘుబాబు లాంటి వారు కీలక పాత్రలలో నటించారు.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    కొణిదెల-దగ్గుబాటి మల్టీస్టారర్‌గా రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, మిగతా ఇండియాలో రూ. 9 కోట్లకు హక్కులు అమ్ముడయ్యాయి. అలాగే, ఓవర్సీస్ హక్కులు మరో 9 కోట్లకు అమ్ముడుపోయాయి.అలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

    10 రోజుల కలెక్షన్స్

    10 రోజుల కలెక్షన్స్

    ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. అలా నైజాం రూ. 34.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.38 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.88 కోట్లు, గుంటూరు రూ. 5.10 కోట్లు, కృష్ణాలో రూ. 3.67 కోట్లు, నెల్లూరు రూ. 2.48 కోట్లతో కలిపి రూ. 74.11 కోట్లు షేర్, రూ. 113 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ. 8.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.40 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఏపీలో కలెక్షన్లు తగ్గడానికి టికెట్ రేట్లే కారణం అని చెప్పక తప్పదు.

    ఇంకా ఎంత రావాలంటే

    ఇంకా ఎంత రావాలంటే

    మొత్తంగా చూసుకుంటే 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.66 కోట్లు షేర్‌తో పాటు రూ. 154 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా 108 కోట్లుగా నమోదైంది. 10 రోజుల్లో రూ. 94.66 కోట్లు వసూలు చేయడంతో మరో రూ. 13.34 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    100 కోట్ల మార్క్ కి చేరువలోనే

    100 కోట్ల మార్క్ కి చేరువలోనే

    మూవీ హిట్ స్టేటస్ అందుకుంటుందా? లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో చేరడమే గగనం అయిపొయింది. ఎందుకంటే ఇప్పుడు ఏడో రోజు నుంచే సినిమా కలెక్షన్స్ ఒక కోటి దగ్గరకు పడిపోయాయి. ఆ తరువాత కొంచెం పుంజుకున్నా కోటిన్నర మించి అయితే రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 100 కోట్ల మార్క్ రావాలంటే మరో ఆరు కోట్లు కావాలి. అలా కావాలంటే సుమారు వారం అన్నా పట్టే అవకాశం ఉంది.

    Recommended Video

    Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
    కానీ కష్టమే

    కానీ కష్టమే

    కానీ ఈ శుక్రవారం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ లెక్కన పదో తారీఖు దాకే భీమ్లా టైం. దానికి ఇంకా మూడే రోజులు మిగిలి ఉంది. మూడు రోజుల్లో రోజుకు రెండు కోట్లు వస్తేనే సినిమా 100 కోట్ల మార్క్ అందుకుంటుంది. కానీ అది అసాధ్యం. పోనీ లాంగ్ రన్ లో కొట్టచ్చు అనుకుంటే రాధేశ్యాం సినిమా కోసం థియేటర్లు ఇవ్వాల్సి రావడంతో ఈ సినిమాను పక్కన పెడతారు. సో పవన్ ఫాన్స్ 100 కోట్ల కల ఈ సినిమాతో అయితే తీరదని చెప్పాలి.

    English summary
    As per trusted sources from trade circles, Bheemla Nayak Looks Impossible To Break Even. and also Pawan Kalyan Fans Wait Continues To Join 100 Cr Club.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X