»   » 50 లక్షల పెట్టుబడి...18 కోట్ల కలెక్షన్: తెలుగులో ఇదే పెద్ద హిట్టేమో?

50 లక్షల పెట్టుబడి...18 కోట్ల కలెక్షన్: తెలుగులో ఇదే పెద్ద హిట్టేమో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కంటెంట్ ఉంటే కటౌట్ చాలు..సినిమా డైలాగే అయినా దేంట్లో అయినా విషయముంటే చాలు దూసుకెళ్లిపోవడం ఖాయం. ఈ విషయాన్ని బిచ్చగాడు సినిమా నిరూపించింది. తెలుగు ప్రేక్షకులకు సినిమా బావుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాను పెద్ద హిట్ చేస్తారనడానికి మరో నిదర్శనం కూడా బిచ్చగాడు సినిమాయే.

అందాల ప్రదర్శన మరీ ఇలానా? రోడ్డు మీద టీవీ స్టార్ బరితెగింపు!

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్' ను తెలుగులో 'బిచ్చగాడు' అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు.

త్రివిక్రమ్ స్పీచ్ సూపర్బ్: బూతులు లేకుండా చాలా కష్టం అంటూ...

చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్ర ప్రభంజనం రోజు రోజుకు పెరిగిందే తప్ప తగ్గలేదు. ..ఎవరినోట విన్నా బిచ్చగాడు సినిమా బావుందనే అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టైటిల్ లోని ట్యాగ్ లైన్ కు తగిన విధంగా కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కేవలం రూ. 50 లక్షలకే తీసుకున్నారట. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 18 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. డబ్బింగ్ సినిమాల జాబితాలో ఇంత చిన్న పెట్టుబడికి ఇంత పెద్ద లాభం తెచ్చింది కాబట్టి ఇదే పెద్ద హిట్టు అని అంటున్నారు.

స్లైడ్ షోలో ఏరియా వైజ్ కలెక్షన డీటేల్స్..

ఆంధ్రాలో

ఆంధ్రాలో


ఆంధ్రాలో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 7,93,87,581/- వసూలు చేసింది.

సీడెడ్ లో...

సీడెడ్ లో...


సీడెడ్(రాయలసీమ) జిల్లాల్లో ఈ చిత్రం ఇప్పటి వరకు 5,14,56,649/- వసూలు చేసింది.

నైజాంలో రూపాయలు

నైజాంలో రూపాయలు


తెలంగాణలో ఈ చిత్రం ఇప్పటి వరకు 5,03,50,696/- కలెక్షన్స్ సాధించింది.

టోటల్

టోటల్


ఈ చిత్రం ఇప్పటి వరకు మొత్తం 18.11 కోట్లు విజయపథంలో దూసుకెళుతుంది.

తెలుగులోనే పెద్ద హిట్టు

తెలుగులోనే పెద్ద హిట్టు


ఓ రకంగా చెప్పాలంటే మాతృక తమిళంలో కూడా సినిమా హిట్టయ్యింది కానీ తెలుగులో సాధించినంత పెద్ద సక్సెస్ సాధించలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇంకా సినిమా ఆదరణ తగ్గకపోవడంతో కలెక్షన్స్ మరింత వచ్చే అవకాశం ఉందని నిర్మాతలు అంటున్నారు. వసూళ్ళ పరంగా బిచ్చగాడు సెన్సేషన్ క్రియేట్ చేసింది.

English summary
Vijay Antony dubbed film Bichagadu collections better than collections of ther telugu movies. Bichagadu mints 18 cr gross at Telugu Boxoffice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu