ప్రభాస్, మెగాస్టార్ బాక్సాఫీస్ ఫైట్ తప్పేలా లేదు.. ఇక KGF 2 వచ్చేది ఎప్పుడంటే?
సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ విడుదల డేట్స్ హాట్ కేకుల్లా మారాయి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ ను ఎవరు వదులుకోవాడానికి ఇష్ట పడడం లేదు. ఈ టైమ్ లో ఎవరు ఎంత చెప్పినా కూడా పెద్ద సినిమాలు మాత్రం వెనక్కి తగ్గేలా లేవని తెలుస్తోంది. వీలైనంత వరకు పండగలకే రావాలని సిద్ధమవుతున్నారు. అందులో ప్రభాస్, మెగాస్టార్ తో పాటు KGF స్టార్ యష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నాలుగు సినిమాలు హిట్టవ్వగానే
గత ఏడాది మొదట్లో తప్పితే మిగతా 10 నెలలు కూడా కరోనా వల్ల రోజులన్ని వృధా అయ్యాయి. ఎలాంటి బిజినెస్ జరగలేదు. ఇక ఈ ఏడాది మొదట్లో కొన్ని సినిమాలు హడావుడి చేసినప్పటికీ అనంతరం వెంటనే దెబ్బ పడింది. నాలుగు సినిమాలు హిట్టవ్వగానే మళ్ళీ సెకండ్ వేవ్ తీవ్రంగా డ్యామేజ్ చేసేసింది.

ఫెస్టివల్ పై టార్గెట్
ఇక ఇప్పుడు కరోనా కేసులు తగ్గడమే కాకుండా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల జనాలు మళ్ళీ థియేటర్స్ కు వస్తారని సినీ నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. ఇక నిర్మాతలు చూపు ఎక్కువగా వినాయకచవితి, దసరా పైనే పడింది. ఆ ఫెస్టివల్స్ కు సినిమాలను విడుదల చేయాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఆచార్య, రాధేశ్యామ్ ఫైట్
అఖండ అయితే వినాయకచవితికి రావచ్చని తెలుస్తోంది. ఇక లవ్ స్టొరీ, సీటీమార్ సినిమాలు కూడా ఆ పండగపై ఫోకస్ చేశాయి గాని తుది నిర్ణయం తీసుకునే వరకు చెప్పలేము. ఇక తరువాత మెగాస్టార్ ఆచార్య సినిమా అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ విజయదశమిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రెండు పెద్ద సినిమాలే కాబట్టి ఫైట్ తప్పేలా లేదని తెలుస్తోంది.

KGF 2 ఎప్పుడంటే?
ఒక ప్రభాస్, మెగాస్టార్ మధ్యలో పోటీకి యష్ KGF 2తో రావచ్చని టాక్ అయితే వస్తోంది. ఇప్పటికే ఆ సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. విడుదల డేట్ ను ఎనౌన్స్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇక అక్టోబర్ లో సెట్టవ్వకపోతే డిసెంబర్ క్రిస్టమస్ కు రావాలని అనుకుంటున్నారు. అప్పుడు న్యూ ఇయర్ కూడా కలిసొచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











