»   » భారీ ప్లాఫ్ టాక్...కలెక్షన్స్ టాప్

భారీ ప్లాఫ్ టాక్...కలెక్షన్స్ టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఫామ్ లో ఉన్న 'మాస్' హీరోలకు ఓ సుఖముంది. సినిమా ప్లాప్ అయినా ఓపినింగ్ కలెక్షన్స్ కు లోటుండదు. దాంతో కొంతలో కొంత కొనుక్కున్న వాళ్ళు నిర్మాతలు ఒడ్డున పడుతూంటారు. ముఖ్యంగా మాస్ హీరోలకు ఫ్యాన్స్ అండదండ ఉండటంతో మొదటి మూడు రోజులు కలెక్షన్స్ కు ఇబ్బంది ఉండదు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ది ఇదే పరిస్ధితి. ప్రేక్షకులను అలరించడంలో తాను 'బాస్'నని అక్షయ్ కుమార్ మరోసారి సత్తా చాటుకున్నాడు.

తాజాగా విడుదలైన 'బాస్'కు దేశ వ్యాప్తంగా భారీ 'ఓపెనింగ్స్' రావడంతో అక్షయ్ మంచి జోరుమీదున్నాడు. కోల్‌కత, ముంబై, నాగ్‌పూర్, అహ్మదాబాద్, పూణె వంటి నగరాలతో పాటు అన్ని ప్రాంతాల్లో విడుదలైన తొలిరోజునే 'బాస్'కు ' ఫ్లాప్ టాక్' వచ్చినా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమని ఈ హీరో సంబరపడుతున్నాడు. విడుదలకు ముందు రోజు రాత్రి తన అభిమానుల కోసం 'బాస్' స్పెషల్ షో ఏర్పాటు చేసి, వారి మనోభావాలను అక్షయ్ తెలుసుకున్నాడు.

తన ఫ్యాన్స్ చెప్పినట్లే తన సినిమాకు మంచి 'ఓపెనింగ్స్' వచ్చాయంటున్నాడు. వినోదం, యాక్షన్, పాటలు, డాన్స్‌లు.. ఇలా అన్ని విషయాల్లోనూ 'బాస్' అందరికీ నచ్చడంతో ఇంతటి ఘన విజయం తనకు దక్కిందంటున్నాడు. అక్షయ్ నటన వల్లే తనకు ఈసారి మంచి హిట్ దక్కిందని 'బాస్' దర్శకుడు ఆంథోనీ డిసౌజా ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

నటన పరంగా భిన్నత్వాన్ని చూపించి అక్షయ్ గొప్ప 'సక్సెస్' సాధించాడని బాలీవుడ్ వాణిజ్య విశే్లషకులు అంటున్నారు. తాము ముందుగా ఊహించినట్లే థియేటర్లలో మరోసారి సంచనలనం సృష్టించి, నిజమైన 'బాస్'గా అక్షయ్ నిలిచాడని ప్రముఖ విశే్లషకులు తరణ్ ఆదర్శ్, ఆమోద్ మెహ్రా తదితరులు చెబుతున్నారు. అయితే సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు.

English summary
With every passing day, Akshay Kumar starrer, ‘Boss’ is picking up numbers at the box-office. The movie made a promising 31.20 crores in just three days of its release. The film turned out to be Akshay Kumar’s biggest opener worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu