twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Godfather Official Collections: గాడ్ ఫాదర్ హవా.. చిరు మాస్ కుమ్ముడు.. 3 రోజుల్లోనే అన్ని కోట్లా!

దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో హవాను చూపిస్తోన్నా.. గతంలో ఎన్నడూ లేని విధంగా జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ఇటీవలే 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చాడు. పొలిటికల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ విశేషమైన స్పందన లభిస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఎన్నో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' 3 రోజుల వసూళ్లను చూద్దాం పదండి!

గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ ఎంటర్

గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ ఎంటర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చింది.

లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ అయింది.

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'గాడ్ ఫాదర్'కు ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 89 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 5.41 కోట్లు షేర్, రూ. 8.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట
విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది

మూడు రోజుల్లో 'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.33 కోట్లు, గుంటూరులో రూ. 2.73 కోట్లు, కృష్ణాలో రూ. 1.58 కోట్లు, నెల్లూరులో రూ. 1.16 కోట్లతో కలిపి రూ. 26.11 కోట్లు షేర్, రూ. 43.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

రెండు రాష్ట్రాల్లో 3 రోజుల్లో రూ. 26.11 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 2.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 34.36 కోట్లు షేర్‌, రూ. 62.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!
కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 34.36 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 57.64 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా చిరు సందడి

ప్రపంచ వ్యాప్తంగా చిరు సందడి

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఈ మూవీ అమెరికాలో ఈరోజు ఏకంగా 1000 షోలను జరుపుకోబోతుంది. అలాగే, హిందీలో మరో 600 లొకేషన్స్‌లో ఇది ప్రదర్శితం అవుతుంది. అంతేకాదు, ఆస్ట్రేలియాలో సైతం చిరంజీవి సినిమా లొకేషన్ల సంఖ్యను పెంచుకోనుంది. దీంతో మెగాస్టార్ మరింతగా సందడి చేయబోతున్నారు.

English summary
Megastar Chiranjeevi Did Godfather Movie Under Mohan Raja Direction. This Movie Collect 34.36 Cr in 3 Days.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X