Don't Miss!
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Waltair Veerayya Day 2 Collections: చిరంజీవి మూవీకి రెండో రోజు తగ్గిన వసూళ్లు.. ఆ సినిమాల ప్రభావమేనా?
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి తాజాగా సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీకి మంచి టాక్ వస్తోంది. ఫలితంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందో ఓసారి లుక్కేద్దామా!

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
మాస్ గెటప్ తో మరోసారి అదరగొట్టిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తెలుగుతోపాటు హిందీ వెర్షన్ లోనూ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మొత్తం కలుపుకుని నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 6 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 7.50 కోట్లు, కృష్ణా రూ. 5.6 కోట్లు, నెల్లూరు రూ. 3.2 కోట్లతో మొత్తంగా రూ. 72 కోట్లు వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..
శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్య తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ వివరాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 69.50 శాతం, బెంగళూరులో 55.50 శాతం, చెన్నైలో 80 శాతం, విజయవాడలో 77.50 శాతం, వరంగల్‌లో 68 శాతం, గుంటూరులో 80 శాతం, వైజాగ్‌లో 83 శాతం, నిజమాబాద్‌లో 44.50 శాతం, కరీంనగర్‌లో 87 శాతం, కాకినాడలో 80.50 వాతం, నెల్లూరులో 93.50 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

హిందీలో ఆక్యుపెన్సీ వివరాలు..
చిరంజీవి-రవితేజ కాంబో మూవీ వాల్తేరు వీరయ్య హిందీ వెర్షన్.. తెలుగు వెర్షన్ తో పోలీస్తే బాగా తగ్గిపోయింది. ముంబైలో అత్యధికంగా రెస్పాన్స్ లభించింది. ముంబైలో 5 శాతం, ఢిల్లీలో 16.50 శాతం, కోల్‌కతాలో 22 శాతం, ఆహ్మదాబాద్ 7 శాతం, సూరత్‌లో 8.50, జైపూర్ 9 శాతం, లక్నోలో 3 శాతం, కాన్పూర్ లో 7 శాతం, వడోదర 2 శాతం రాగా అత్యధికంగా భోపాల్ లో 42 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చూపించాయి.

రెండో రోజు కలెక్షన్స్..
మాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు ముందుగానే మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. రెండో రోజు రూ. 16 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ. 45.60 కోట్లు రానున్నట్లు అంచనా వేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 55 నుంచి 60 కోట్ల వరకు కలెక్ట్ చేయవచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం.

తొలి రోజు వసూళ్లు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 22.90 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా ప్రపంచవ్యాప్తంగానూ సత్తా చాటింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే విడుదలైన మొదటి రోజు మెగాస్టార్ నటించిన మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 29.30 కోట్లు షేర్, రూ. 49.10 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే రెండో రోజుకు తెలుగులో విజయ్ వారసుడు, సంతోష్ శోభన్ కల్యాణం కమనీయం సినిమాల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.