Chiranjeevi Vs Balakrishna: చిరంజీవిని కొట్టలేకపోయిన బాలకృష్ణ.. ఆ విషయంలో ఎదురులేని మెగాస్టార్!

సినిమా పరిశ్రమలో అగ్ర నటుల మధ్య పోటీ ఉండటం సహజంగానే కనిపిస్తుంటుంది. బిజినెస్, కలెక్షన్లు ఇలాంటి అంశాల విషయంలో నువ్వా? నేనా అనే విషయం దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సీరియస్‌గా తీసుకొంటారు. టాలీవుడ్‌లో అయితే టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఈ విషయాలపై భారీగా చర్చ జరుగుతుంటుంది. అయితే ఇలాంటి చర్చ ఫ్యాన్స్ మధ్య రేకెత్తించే అంశాల్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా బాలకృష్ణతో పోటీ విషయంలో చిరంజీవి మరోసారి తన అధిక్యాన్ని రుజువు చేసుకొన్నారు. ఏ విషయంలో మెగాస్టార్ తన హవాను కొనసాగించారనే విషయంలోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు అగ్ర నటులనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒకరు తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మరొకరు స్వయంకృషితో లెజెండరీ యాక్టర్‌గా ముందుకు పోతున్నారు. అయితే ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ 90వ దశకం నుంచి భారీగా కనిపిస్తుంటుంది. ఈ టాప్ హీరోల సినిమాల విషయంలో ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతుంటుంది. అయితే తాజాగా ఈ ఇద్దరు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమయ్యారు.

Chiranjeevi s Mana Shankara Vara Prasad Garu beats Balakrishna s Akhanda 2 Worldwide Business

నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే.. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్నాడు. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమాతోను మంచి విజయాన్ని అందుకొన్నారు. గత కొద్దికాలంగా బాలయ్య సక్సెస్ జోష్‌తో ముందుకు వెళ్తున్నాడు. ప్రొఫెషనల్‌గా కూడా టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అఖండ మూవీకి సీక్వెల్‌గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

అఖండ 2 మూవీ గ్రాండ్‌గా డిసెంబర్‌లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. బాలయ్య కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఆయన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే అఖండ 2 సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 140 కోట్ల రూపాయల మేర జరిగిందనే విషయం ట్రేడ్ వర్గాల్లోప్రచారంలో ుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే..సంక్రాంతి రేసులో మన శంకర వర ప్రసాద్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ముందు చిరంజీవి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. దాంతో ఆయనకు తప్పనిసరిగా హిట్ పడాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రాక్ రికార్డు సరిగా లేకున్నా.. చిరంజీవి స్టామినా మరోసారి రుజువు అయిందని ఆయన తాజా సినిమా తెలియజెప్పింది.

సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 170 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ విషయంలో మరోసారి బాలయ్యపై చిరంజీవి అధిపత్యాన్ని కొనసాగించారు అనే విషయం సోషల్ మీడియాలో మెగా అభిమానులు షేర్ చేసుకొంటున్నారు. అయితే ఈ రెండు సినిమాల బిజినెస్ విషయాలు అధికారికంగా బయటకు వస్తే గానీ.. అసలు విషయం బయటపడదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Read more about: chiranjeevi balakrishna akhanda 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X