twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya Vs Veera Simha Reddy బాలకృష్ణను బీట్ చేసిన చిరంజీవి.. ఓవర్సీస్‌లో బిజినెస్ ఎంతంటే?

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో 2023 సంక్రాంతి పండుగ బరిలో భారీ చిత్రాలు రంగంలోకి దిగుతుండటంతో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ లాంటి అగ్రహీరోలు సంక్రాంతి రేసులోకి దూకనున్నారు. దాంతో వచ్చే ఏడాది ఆరంభంలోనే భారీ పోటీకి తెరలేచింంది. ఇక ఈ నలుగురు అగ్రహీరోల సినిమాల ఓవర్సీస్ బిజినెస్‌లు క్రేజీగా జరిగాయి. ఆ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

     నలుగురు అగ్రహీరోలు మూవీస్

    నలుగురు అగ్రహీరోలు మూవీస్

    సినిమా పరిశ్రమలో 2023 సంక్రాంతి ఎన్నడూలేని విధంగా స్టార్ హీరోల పోటీకి రంగం సిద్దమైంది. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారిసు, తనివు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమయ్యాయి. అయితే ఈ రేసు నుంచి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తప్పుకోవడంతో ఈ పోటీ మరింత క్రేజీగా మారింది. సంక్రాంతి పందెంలో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

     తమిళంలో ఫ్యాన్స్ వార్

    తమిళంలో ఫ్యాన్స్ వార్

    తమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్, అజిత్ మధ్య భారీ పోటీ ఉంటుంది. వీరిద్దరి సినిమాలు రిలీజైతే.. ఫ్యాన్స్ మధ్య ఊహించిన వార్ ఉంటుంది. సాధారణంగా ఈ ఇద్దరి హీరోల సినిమాలు వేర్వేరుగా రిలీజైతేనే.. రచ్చ రచ్చ ఉంటుంది. ఈ సారి అజిత్, విజయ్ ఇద్దరు ఒకేసారి బరిలోకి దూకడంతో ఈ రచ్చ పీక్స్‌కు చేరే అవకాశం ఉంటుంది.

    వారిసు ఓవర్సీస్ బిజినెస్ ఎంతంటే?

    వారిసు ఓవర్సీస్ బిజినెస్ ఎంతంటే?

    దర్శకుడు వంశీపైడిపల్లి, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో విజయ్ హీరోగా రూపొందుతున్న వారిసు చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ క్రేజీగా జరిగింది. ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 35 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.

    అజిత్ మూవీ ఓవర్సీస్ రైట్స్

    అజిత్ మూవీ ఓవర్సీస్ రైట్స్

    ప్రముఖ నిర్మాత బోని కపూర్, సెన్సేషనల్ డైరెక్టర్ హెచ్ వినోద్ కాంబినేషన్‌లో అజిత్ కుమార్ హీరోగా వస్తున్న చిత్రం తనివు. మంజు వారియర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో థియేట్రికల్ బిజినెస్‌ కూడా క్రేజీగా జరుగుతున్నది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 13 కోట్ల అమ్ముడుపోవడం విశేషంగా మారింది.

     చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ

    చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ

    ఇక తెలుగు రాష్ట్రాల్లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మధ్య భీకరమైన పోటీకి రంగం సిద్దమైంది. అఖండ బ్లాక్ బాస్టర్ తర్వాత బాలకృష్ణ, గాడ్‌ఫాదర్ విజయం తర్వాత చిరంజీవి ఇద్దరూ మరోసారి బాక్సాఫీస్ వద్ద చెలరేగేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతున్నది. దాంతో ఈ సంక్రాంతి పందెంలో చిరంజీవి, బాలకృష్ణ విజయాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    వీర సింహారెడ్డిపై వాల్తేరు వీరయ్య పైచేయి

    వీర సింహారెడ్డిపై వాల్తేరు వీరయ్య పైచేయి

    గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ గతంలో కంటే రికార్డు స్థాయిలో జరిగింది. వీర సింహారెడ్డి చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 5.5 కోట్లకు అమ్ముడుపోయాయి.

    ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 8.5 కోట్ల ధర పలికింది. దాంతో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద వచ్చే ఏడాది రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే అఖండ తర్వాత చిరంజీవి మార్కెట్‌ను బాలకృష్ణ టేకోవర్ చేస్తారనే ఊహాగానాలు భిన్నంగా, తక్కువగా బిజినెస్ చేయడం ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

    English summary
    Chiranjeevi's Waltair Veerayya, Balakrishna's Veera Simha Reddy are set to release for Sankranti 2023 box office fight. Here is the overseas business details of Waltair Veerayya, Veera Simha Reddy, Varisu, and Thunivu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X